పుట:Rangun Rowdy Drama.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

రంగూన్‌రౌడీ.

జయ - పిల్లవాఁ డేడిస్తే?

నాందీ - ఏడిస్తే. పాలిచ్చి సముదాయించు.

జయ - నాదగ్గర పా లెక్కడివి ! పాపాలు.

నాందీ - పాలు లేకుంటే డబ్బాపా లియ్యవచ్చును.

(నిష్క్రమించును.)

జయ - అరే! భగవాన్ - ఇ దెక్కడి సంసారమురా బాబూ !

(పిల్లవాఁ డేడ్చును.)

జయ - అరే బచ్చా ఛూప్ - (ఏడ్చును.) అరే ఛూప్ రే ఛూప్ !

గంగా - అరే దర్వాన్ !

జయ - అరే భగవాన్ !

గంగా -- రాధాబాయి యెక్కడుందీ ! దానికి కాపలావుండుమంటే. మానివేసి, నీవు వేరే ఉద్యోగములో ప్రవేశించా వెందుకూ ?

జయ - సేఠాణీ ఈపిల్లవాణ్ణి నా కప్పగించింది.

గంగా -- పిల్లవాణ్ణెత్తుకోవడం కూడా ఒక వుద్యోగమేనా ?

జయ - ఈరోజుల్లో తాసీల్ దార్ల అట్టెండర్ల కదే వుద్యోగము.

గంగా - వీణ్ణి నేను చూస్తాను. నీవు తక్షణం రాధాబాయిదగ్గర కాపలావుండు.

జయ:- (నిష్క్రమించును.)

(బాలుఁ డేడ్చును.)

గంగా -- అరే బాబా ! ఛూప్ రహో, ఛూప్ రహో,

(బాలుఁడు మరింత యేడ్చును.)

శంక - అరే! తేరీపాం పకడ్తాహుం. తేరీకు సలాం కర్తాహుం. ఛూప్ బాబా- ఛూప్ - (ఏడ్చును) అరె అరె బడీ ముష్కీల్కా కాం హై ! అభీ మైక్యాకరుం ! అరే దర్వాన్ - బచ్చా రోతాహై దర్వాన్ (బాలుఁ డేడ్చును.)