పుట:Rangun Rowdy Drama.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[4]

తృతీయాంకము.

47

ఆ. వె. నీవు వలచినట్టి నెలతుకసోదరు
         కొంప నిలుప నీవు గోరినావు
         నేను వలచినట్టి నెలతుకజనకుని
         కొంపదీయ నేను గోరినాను.

కృష్ణ - మహాకవివి; నీతో నేను మాటలాఁడగలనా? ఇఁక నీవు నీకార్యమునం దుందువుకదా ?

జయ - అవశ్యకముగా !

కృష్ణ - మిత్రమా ! చిరకాలమునకు వచ్చితివి. చిన్నవిందారగించి పోవుదువుగాని లోనికి రమ్ము.

జయ - మంచిది.

(అనుబంధము-16.)

(ఇరువురును నిష్క్రమింతురు)

తృతీయాంకము.