పుట:Rangun Rowdy Drama.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము.

43

సరము నీ కేమియున్నది ! తండ్రియైశ్వర్యమును పోగొట్టుకొని నాచిన్నతండ్రి యితరుల తిండికొఱ కాశించునా ! ఇది యెన్నఁటికిని జరగదు. భాగ్యము లేకున్నయెడల పంచలఁ బట్టుకొని బిచ్చమెత్తుకొని జీవింతుము గాని, పరాన్నభుక్కుల మగుదుమా!

కృష్ణ — (స్వగతం) ఆహా ! పరమేశ్వరా ! ఈమె కిట్టిబుద్ధి పుట్టనేల !

మోహ - మామా ! నాకొక చిన్నమోటారుబండి కొనిపెట్టవూ !

కృష్ణ - మోటారుబండితో నేమిచేయుదువు మామా !

మోహ - నాన్నగారిదగ్గఱకు వెళతా !

అన్న — (తనతో) హా ! తండ్రి ! నాయనగారిదగ్గఱకు వెళ్ళుభాగ్యమే యున్న యెడల మన యదృష్ట రేఖ లిట్లుండ నేలరా !

కృష్ణ -- మీనాన్నగా రెక్కడ నున్నారు మామా !

మోహ — మాపెద్దబంగాళాలో నున్నారు.

కృష్ణ - లేరుమామా ! మీపెద్దబంగాళాలో మారువాడీవాఁడున్నాఁడు. మనము వెళ్ళితిమా వాఁడు కఱ్ఱతీసికొని కొట్టును.

మోహ -- ఆ ! ఏమిటీ ! మామయ్యా ! మారువాడివాఁడా! మనలను కొట్టునా ! నాబలము తెలియకుండా మాటాడినావు మామయ్యా ! వానిబుర్ర చితుకగొట్టెదను. నావెంట నిప్పుడే రా {{c|(అనుబంధము - 15)|| కృష్ణ -- ఆగు ! మామయ్యా! పోవుదము. మీనాయనకన్న మంచిపేరు తెచ్చుకొనెదవు మామా ! (ముద్దిడుకొనును)

అన్న - హా తండ్రీ ! నీముద్దుమురిపెములను చూచుటకు నీతండ్రిగారి కదృష్టమున్నదో ! లేదో కదా !

ఆ. వె. కన్నతండ్రి ! ఇంత పిన్నటనే నీకు
         పితరుఁడుండి లేనిగతిఘటిల్లె;