పుట:Rangun Rowdy Drama.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము.

37

శంక — వట్టిమాట. ఇది యంతయును నన్ను హసించుటకుఁ గావలయును. కానిచో నింతకుమున్నే కదా కోరంగిజాతి యనాగరక జాతియని గర్భశూలాయమానముగ నెత్తిపొడిచితిరి.

ప్రభా - అది జాతియంతటిమీఁదను చేయఁబడినవిమర్శ. ప్రత్యేకవ్యక్తుల కాధిక్యత యుండఁగూడదా ?

శంక - ఓహో! నీ వొకగొప్పవిమర్శకురాలివలె నున్నావే! సాక్షిసంఘమున బొఱ్ఱయ్యసెట్టి చచ్చినపిదప సభ్యుఁడు కొఱఁతవడినాఁడఁట. జంఘాలశాస్త్రికి దరఖాస్తు చేయుదువా ?

ప్రభా -- సాక్షి, యేమో, సంఘ మేమో నే నెఱుఁగను గాని, నేను మకరమున చంపి చావనున్ననిన్ను రక్షించినసాహసకార్యముల యొక్క ఋణభారమును నీ వేరీతిగ వదల్చుకొనఁ దలఁచితివి?

శంక - ధనము మినహా - నావద్దకల దేదియైన దాచక యిచ్చెదను.

ప్రభా - మానవుని ముఖభాగమునందు నవనీతమునకన్న మృదులమై, రోజాపుష్పమునకన్న మనోహరవర్ణవిభాసితమై యొప్పారు. ప్రదేశ మేది?

శంక - అధరము కావచ్చును.

ప్రభా - షడ్రుచులందును సమస్తజీవకోటికిని ప్రియతమమైనరుచి యేది?

శంక - మాధుర్యము కావచ్చును.

ప్రభా - అధరమునం దట్టిమాధుర్యము నొసంగఁగలయనుభవ మేది గలదో దానిని నా కిచ్చినట్లైన నీఋణభారమునుండి విముక్తి నొందగలవు.

శంక - చుంబనమా! అబ్బా! చుట్టుమాటలతో న న్నెంత క్షోభ పెట్టితివి?

(అనుబంధము 14.)

(తెరలో పాదసంచలనము.)

ప్రభా - పాదసంచలనముచేత నా ప్రాణేశ్వరునిరాక తెలియుచున్న ది.

(ఇరువురు క్రమసితియం దుందరు.)