పుట:Rangun Rowdy Drama.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

రంగూన్‌రౌడీ.

లేశమును గృపలేని పోలీసువృత్తి
యనెడు కత్తిచేతను గోతు వయ్య తండ్రీ !

గంగా - మహరాజ్'! హత్యచేసినవాడు అల్లుఁడు. గోడుననేడ్చుచున్నది కుమార్తె. అంతకఠినముగా నుండుట మీకర్హమైనపనిగాదు. కొంచెము దయఁదలఁపుఁడు. ఈమాట నే నెవ్వరితోను చెప్పను.

తుల - గంగారాం ! నీకు తెలియదు ! నీవు మాటలాఁడకు.

గంగా - ఆమెదుఃఖమును విన్న నాకే గుండెలు నీరగుచున్నవి ! కన్న తండ్రివి, లేక లేక కలిగిన యేకపుత్రిక.

తుల - ఓరీ! నీమారువాడీనక్కవిషయములు నాయొద్దసాగవు. కట్టిపెట్టు.

అన్న - తండ్రీ ! ఒకరియుపదేశములు నీకేల ! నీయంతరాత్మయే నీకు సాక్ష్యముగాదా! నాప్రార్థనం ద్రోసిపుచ్చక నాకు పతిభిక్షనిమ్ము.

(అనుబంధము - 12.)

తుల - అన్నపూర్ణా! లెమ్ము నీదుఃఖమును వినిన నాకు విచారముగనే యున్నది. కాని, నే నేమిచేయుదును ? నాధర్మమును నేను నిర్వర్తింపక తప్పదు.

అన్న - తప్పదా? తండ్రీ! తప్పదా?

తుల - తప్పదు. తప్పదు.

అన్న - అల్లునియుసురు తీసి, ఆత్మజను విధవను జేతువా ?

తుల - అది మీవ్రాతఫలము; నే నేమిచేయఁగలను ?

అన్న - ఆవ్రాతఫలమును మార్చుటకు నీ కధికారము కలదుకదా ?

తుల - నాకేమి యధికారముగలదు? నేను సేవకమాత్రుఁడను!

అన్న -- నీవు దయఁదలంచిన రక్షింపఁగలవు.

తుల - దయగల్గినవాడనైనచో - నీయుద్యోగమున నే చేరి యుండను.

అన్న — నీకడుపును నీవే మంటఁ బెట్టుకొందువా ?

తుల - నాకడుపు మండినచో ఆదుఃఖము ననుభవింతును.