పుట:Rangun Rowdy Drama.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

రంగూన్‌రౌడీ.

జయ - చాలా చాలా యిష్టం

గంగా - అమ్మాయీ ! నీ కితఁడు కాపలాఉండడం ఇష్టమేనా ?

రాధా - నాకూ చాలా చాలా ఇష్టం.

గంగా - ఐతే - నాందీ ! మనం వెళదాం రా !

(నాందీ-గంగా-నిష్క్రమింతురు.)

రాధా - దర్వాన్ !

జయ - భగవాన్ !

రాధా - బజారునకు వెళ్ళి నాకు ఫలాహారము తెచ్చిపెట్టు.

జయ - ఇది ఎగ్రిమెంటులో లేనిమాట.

రాధా - ఐతే-నాసాడీ, చాకలషాపులో వేసి వస్తావా ?

జయ - ఇది ఎగ్రిమెంటులో అసలే లేనిమాట.

రాధా -- ఓహెూ ! నీయగ్రిమెంటునూ నిన్నూ కాస్తపరీక్ష చేయవలసినదే ! (మీసము లాగివేయును.)

జయ - మై యెంప్రెస్ -అయాం యువర్ సెకండ్ హ్యాండ్ ఒథెల్లో.

రాధా - దర్వాన్ మహరాజ్ ! బ్రహ్మానందము...."

(అనుబంధము - 10.)

(ఇరువురు నిష్క్రమింతురు.)

[ తెరవ్రాలును.]

రంగము- 2.

స్థలము:-- శంకరరావుమందిరము.

(అన్నపూర్ణ విచారముతో కూర్చుండియుండును.)

అన్న-

(అనుబంధము - 11.)

కటకటా ! ఇవియంతయు నాగ్రహకాలమహిమ దప్పవే ఱేమియుఁ గాదు.