పుట:Rangun Rowdy Drama.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రంగూన్ రౌడీ

అను

పతిభక్తి.

ద్వితీయాంకము.

రంగము - 1.

స్థలము:-గంగారామునియిల్లు.

[నాందీ బాయి ప్రవేశము.]

నాందీ

(అనుబంధము-8.)

నామగఁడైన గంగారాంసేటునకు డబ్బుదయ్యము పట్టుకొనినది. నాబిడ్డ రాధాబాయి ఱంకులరాట్టము. మిండఁడెవ్వడును దొఱుకకపోయెనని మిడుకుచున్నది. ఇంక నే నొక్కతెను, ఇంటెడుచాకిరి చేసికొనుటకు దొరికినాను. ఇంటిమగఁడైన గంగారాంసేట్‌గారికి. ఈఁడుమీరినను యెన్నికష్టములు పడినానో ఈశ్వరున కెఱుక. నెలతప్పి నేటికి మూఁడవ మాసము. “ఇఁకమీఁద ఇంటిచాకిరీ చేయలేను, దాసిని కుదర్పకతప్ప"దని దయ్యమువలె వెంటఁబడఁగా - తప్పక కుదుర్తునని ఇంటియాయన చెప్పి యెక్కడికివెళ్ళినాఁడో యిప్పటికి జాడలేదు. (విని) సందులో నెవరాచప్పుడు చేయునది !

[దొరసానిదుస్తులతో దాసి ప్రవేశించుచున్నది.]

దాసి - ఏమమ్మా! ఏమి? నేనే!

నాంది - ఓహోహో ! ఈవి డెవ్వరు బాబూ ! దొరసానివలెనున్నదే !

దాసి - ఏమమ్మా! నాతో నేమైన పనియున్నదా ?