పుట:Rangun Rowdy Drama.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[2]

ప్రధమాంకము.

15

నీముసలిదానిని పోషింపలేకపోము. కాని ముందు నీగతిచూచుకొనుము. ఈయైశ్వర్యము నీకు శాశ్వతముగాదు. కన్నులు తెఱచుకొనుము. సజ్జనులదారినినడువుము. కులమునకప్రతిష్ఠ తేకుము.

శంక -- కోపముతో, హహ్హహ్హహ్హ ! ఔ నే జానకీ ! ముసలిదానిని బోషించుటకు మీరు భిక్షమెత్తవలసిన పనియేమి ? నీవును నీవదినెయు మంచి పడుచుఁదనములో నున్నారు; సానివృత్తిచే నై న సంపాదింపఁగలరు.

జాన — (కోపముతో) ఓరీ! చండాలుఁడా ! మహాపతివ్రతయైన వదినెగారిని, లోకజ్ఞానము నెఱుంగని నన్నును సానివృత్తి చేయుమని దూషింపుచుంటివా ? నీ నాలుక చీలికలుగాను ! కులభ్రష్టుఁడా ! త్రాగుఁబోతా ! నీ వెట్టి ఘోరనరకమునఁ బడిపోవుదువోకదా ! పాపాత్ముఁడా ! ! నీకాల మింక నెన్నఁడు సమీపించునురా ?

(అనుబంధము - 7.)

(రంగారావు ప్రవేశము.)

రంగా - అమ్మాయీ ! వీనికి నేను గట్టిగా బుద్ధిచెప్పెదను. నీపు తల్లిగారిని దీసికొని ఇంటికిఁ బొమ్ము. వీనికిఁ గన్నులిప్పుడు నెత్తికి వచ్చియున్నవి. సరిజేసనఁగాని జ్ఞానము రాదు.

జాన — తాతగారూ ! తమయాజ్ఞప్రకారము చేయుదుము. అమ్మా! ఈదరిద్రుఁ డిప్పుడు త్రాగి యొడలు తెలియకున్నాఁడు. వీనితో మనకు వివాదమేల ? రమ్ము ! అన్నిఁటికిని తాతగా రున్నారు.

(తల్లినిదీసికొని నిష్క్రమించును.)

శంక - ఓసీ ! భ్రష్ఠముండా ! దరిద్రుఁడ నఁటే నేను ? దరిద్రము నాకో మీకో యిఁక తెలియఁజేసెదనులే. హహ్హహ్హహ్హహ్హ! (త్రాగును.)

రంగా - ఓరీ ! కుఱ్ఱకుంకా ! వా రేల దరిద్రు లయ్యెదరురా ?

శంక - కూటికి గతిలేక,