పుట:Rangun Rowdy Drama.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

రంగూన్‌రౌడీ.

సర్వమునకు నాకు సానియు బ్రాందియే

గతి యటంచు నెఱిఁగి కదలిపొండు.

జాన - హా ! పరమేశ్వరా ! ఎట్టి సజ్జనునినోటినుండి యెట్టి దుష్ప్రలాపంబు లాడించుచున్నావు !

తల్లి - హా ! దైవమా ! చావసిద్ధముగానున్న నా కేమిగతి చూపితివి ? పరలోకమం దున్న ప్రాణేశ్వరా ! మీకుమారుఁడు నాకు పిడికెడుకూడైన లేకుండఁజేసినాఁడు. ఈదురవస్థ ననుభవింప కుండ చల్లగాఁ బరలోకమున కేగిన మీరే ధన్యులు. నాకు సుమంగిలినై చచ్చు యోగ్యత కలుగకపోయెను. ఎంత మహైశ్వర్యముతోఁ దులఁదూగితినో యంత కంత హీనస్థితి నా కిప్పుడు కలిగినది. బిడ్డా ! జానకీ ! ఇంక నే నీహీనపుబ్రదుకు బ్రదుకలేను. నా కేదైన నింత విషముపెట్టి చంపుము. లేదా న న్నేనడిసముద్రముననైన బండగట్టి బలవంతముగఁ ద్రోసి వేయుము.

జాన - అంత పనిచేయుటకు నీముద్దులకొడుకు సిద్ధముగనే యున్నాఁడు నా కెందుల కీపాపఫలము?

తల్లి - నాయనా ! శంకరా ! ఇట్లు కష్టపెట్టి చంపియు చాననీకుండఁ జేయుటకన్న నీతుపాకితో నొక్కమాఱు నాముసలిగుండెలలో ప్రేల్చి చంపలేవా ? ఇందులకైన నీకుఁ గరుణరాదా ?

జాన - అన్నా ! అమ్మశోకము నీకు వినఁబడుట లేదా ? చెడత్రాఁగి, “తల్లిలేదు, చెల్లెలులేదు, భార్యలేదు, కొడుకులేడు; నాకు సర్వమునకు సారాయియును సానియే" యని యొడలెఱుఁగక ప్రేలెదవా ? ఎంత బుద్ధిహీనుఁడవై తివి ? ఇది నీకు శ్రేయస్సు కాదుసుమా! మాతృశాపము మంటఁబెట్టునుగాని వదలదు సుమా ! ఏకష్టములోపడి నీపేరు చెప్పుకొనుచు భిక్షమెత్తియైన