పుట:Rangun Rowdy Drama.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధమాంకము.

9

జయ - (కోటుతీసివైచి ఉత్తరీయమును రోబ్ వలె కట్టుకొనును) నౌ కమాన్ ది సీజ్ మైసోర్డ్హూప్. (పెన్సిలుతీసి వెండ్రుకనుకోసి) హ్హహ్హహ్హహ్హా. నౌ అయాం దీ సెకెన్డు హ్యాన్డ్ ఒథెల్లో - నౌ కమాన్ నికాలో ఫుట్‌లైట్ -హూప్ - (దీపము లారిపోవును.) నౌ బతావ్ ఫోకస్ (ఫోకస్ చూపఁబడును.) హ్హహ్హహ్హహ్హ ! నౌ - అయాం దీ సెకన్డు హ్యాన్డ్ ఒథెల్లో-(తనకోటును నేలపై మనుష్యాకృతిని పరచి) నౌ ది సీజ్ యువర్ ఫాదర్ గంగారాంసేట్. అయాం, నౌ, రెడీ, ఖూనీ, కర్నే కేలియే. (కత్తిసాము నటించి తుదకు సలాంచేయును.)

రాధా - -వహ్వా ! వహ్వా ! (చప్పట్లు కొట్టును.)

గంగా – (ఆక్షేపణగా) వహ్వా ! వహ్వా ! ఈశూరుఁడు నన్ను ఖూనీ చేయుట, ఈవిడ మెచ్చుకొనుట. వహ్వా ! వహ్వా !

జయ - ఆల్ రైట్- ది సీజ్ ది మర్డర్ సీన్ ఆఫ్ యువర్ ఫాదర్ గంగారాం సేట్. (క్రిందనున్న కోటును పొడిచి దానిఫైఁబడి దొరలుచు, కోటును తనశరీరమునకు చుట్టుకొని కూర్చుండును.)

రాధా - వహ్వా ! వహ్వా ! (చప్పట్లు కొట్టును.)

గంగా - (బయటకువచ్చి) వహ్వా! వహ్వా! ది సీజ్ ది మర్డర్ ఆఫ్ గంగారాం సేట్ ! అరే ఉల్లూకాబేటా ! (చెవిపట్టుకొని) ఇల్లాంటి వెఱ్ఱిసరసాలు యేడువకుండా ఇప్పటికి చెప్పుదెబ్బలతో సరిపెడతాను. ఈసారి నాకొంపలో కాలుపెడితే ఈఖూనీ నీకు జరుగుతుం దనుకో.

(అనుబుధము.5.)

(చెప్పుదెబ్బలు కొట్టును. అందఱు నిష్క్రమింతురు.)

(తెరవ్రాలును.)


__________