పుట:Rangun Rowdy Drama.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

రంగూన్‌రౌడీ.

రాధా - అంతేకదా ! నిజముగ చంపరు గదా?

జయ - చంపినమాత్ర మేమి? నీతండ్రి చచ్చినయెడల నిలువచేసిన ధనమంతయు మనకే దక్కును.

గంగా - ఓరి నీపొట్టపొడిచివేయ? నీ కెంత దుర్బుద్ధి పుట్టెనురా ? గంగారాంసేటును నీవటరా చంపువాఁడవు? ఉండుండు. నీకు చెప్పుదెబ్బలు కావలసియున్నవి.

రాధా - మీ రిట్టిమాట లాడినచో నిక్కడ నిలువవద్దు. వెడలిపొండు.

జయ - కాదు కాదు. ప్రియురాలా ! ఊరక పరిహాసమున కట్లంటిని. ఇది నిజమేనా ?

రాధా - ఇంతేకద !

జయ - మఱి ఇంకెంత? సరేగాని నాగ్రంధములోని గంగారామసంహారమును నటించి చూపనా ?

రాధా - మీరు నటకులుకూడనా యేమి ?

జయ - నీ కింకను తెలియదా? ఛాలెంజిగా యాక్టుచేసినవాఁడను.

రాధా - సరే. మీనటనమును చూపుఁడు.

జయ - ఎస్. నౌ అయాం దీ సెకండ్ హ్యాన్డ్ ఒథెల్లో

గంగా -- సెకండుహాన్డ్ సిగరెట్టువలె వీఁడు సెకన్డ్ హాన్డ్ ఒథెల్లోయఁట.

జయ - బ్యాండు ట్యూన్ -- ఆదితాళం.

హహ్హహ్హహ్హహ్హహ్హా - అయ్యాం సెకండ్ ఒథెల్లో!! హా!!
లుక్‌ఎట్ - లుక్‌ ట్ - మై గ్యాలెంట్
వెరివెల్ - వెరి వెల్ - మైట్యాలెంట్ || హ||
అయ్యాం ఆధర్ - అయ్యాం ఆక్టర్ - ఎవ్విర్‌ధింగ్ అయ్యాం
యూ ఆల్‌కం అండ్ - చీఫ్ మీ అప్ -ఇన్‌దిస్ గ్యాలోనైట్ || హ||

జయ - నౌ కమాన్ ! ది సీజ్ మై రోబ్ !

గంగా - (చెప్పుతీసి) నౌ కమాన్ ! ది సీజ్ మై బూట్.