పుట:Rangun Rowdy Drama.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

రంగూన్‌రౌడీ.

అన్న – నాధా ! నాధా ! ఒక్కనిమిషము తాళుఁడు. మైలస్నానమైనఁ జేసిపొండు.

శంక - ఒక్క క్షణ మాగను ! (అనుబంధము.2.)

(త్రోసివైచి నిష్క్రమించును.)

(తెరవ్రాలును.)

రంగము 2.

స్థలము:— గంగారాముని గృహము.

[రాధాబాయి ప్రవేశించును.]

రాధా - (అనుబంధము - 3.)

నాతండ్రియగు గంగారామునకు ధనముపై ప్రేమ. మా అమ్మ యైన నాందీబాయికి అధికారముపై ప్రేమ. నామట్టునకు నాకు వలపుగానిపై ప్రేమ. ఆహాహా ! ఆజయరాముఁ డెంత అందమైనవాఁడు ! (చేతిగడియారము చూచి) ఐదుగంటలైనది. వచ్చెదనని చెప్పినవేళ యైనది ! ఏమిచెప్పుమా ఇంకను రాకున్నాఁడు ? అదిగో బయట చప్పుడు. తప్పక జయరామ సింగే వచ్చియుండును. (తలుపుతెరచును.)

[చేతిలో నొక పుస్తకముతో జయరాం ప్రవేశము. ]

జయ - వెల్ - మైడియర్ యంప్రస్ ! గు డీవినింగ్ ,

రాధా - అన్నమాట తప్పకుండ అనుకొన్నవేళకు సత్యహరిశ్చంద్రునివలె సరిగా వచ్చినారే!

జయ - అన్నమాట యేమి? నామాటయే తప్పలేదు. నా కన్నలు గాని, తమ్ములుగాని లేనే లేరు.

రాధా - చాలు లెండి ! కవీశ్వరు లైనందుకు కడుచమత్కారముగా మాటలాడుచున్నారే!