పుట:Rangun Rowdy Drama.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

రంగూన్‌రౌడీ.

యిది నిజ మనుకొనకు. మేము నేఁడు చాల సంతోషముతో నున్నాము. ఆసంతోషమున మాదేవిగారివైన నీతో పరిహాసము లాడితిమి. సరేగాని మాసంతోషమునకుఁ గారణమేమో యెఱుఁగఁ దలంచితివా?

అన్న — నాథా! అదియెట్టిదో సెలవిండు. ఆకర్ణించి యానంద మందెదను.

శంక - ముసలిముండకొడుకు మూట ముల్లె కట్టి పైకి వేంచేసినాఁడు. అదే మా కానందము !

అన్న - ముసలిముండకొడు కెవ్వరు ? మామగారా యేమి ?

శంక - మరియిం కెవ్వ రనుకొంటివి ? చావకుండ బ్రదుకకుండ నెన్ని నాళ్లు మంచమునఁబడి యేడిపించినాఁడు. హహ్హహ్హహ్హహ్హ.

అన్న — (దుఃఖముతో) శ్రీరామచంద్ర ! ఎట్టిఘోరవార్తవింటిని ?

ఆ. ఇంట నేను పాద మిడినంత నుండి న
    న్గన్నబిడ్డవోలె కరుణఁ జూచె;
    నట్టి సదయహృదయుఁ డగుమామగారి దు
    ర్మరణవార్త పిడుగుమాడ్కిఁ దోఁచె.

శంక – (అసహ్యముతో) ఛీఛీ ! జ్ఞానహీనురాలవు. నీ దుస్స్వభావమే యిది. అందులకే నిన్ను నేను నిందించుచుందును. ఆఱులక్షల రూపాయిలు, యాఱువందల యెకరముల మాగాణి, ఆనందకరములైన యుద్యానవనములు, అత్యున్నతములైన సౌధములు ! వహ్వా ! అనాయాసముగా లభించె నని నే నానందపడుచుండఁగా నీకు విచారమా? ముసలిముండ కొడుకు చచ్చిననేమి ? పుచ్చిననేమి ?

అన్న — అయ్యయ్యో ! ప్రాణేశ్వరా ! గృహాధికారి - వృద్ధుడు - మహావిజ్ఞానశీలుఁడు - ఒక్కచేతిమీదుగా ఇంత ధనమును సమార్జించిన యైశ్వర్యవంతుఁడు - మరణింపఁగా ఆయనగర్భ