పుట:Rangun Rowdy Drama.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాంకము.

3

అన్న -- (భర్తవంకకుఁ దిరిగి) నాధా ! నిరంతరము మీ పాదపద్మపరిచర్య కర్హు రాలనైన మీదాసి నగు నన్ను “అన్నపూర్ణాదేవిగా” రను పెద్దపేరునఁ బిలువ నేల ?

శంక - ఏలనా ? ఈదినముఁగూడ మేము త్రాగి వచ్చినందులకై మీరు దండింపకుండఁ జేసికొనుటకు.

అన్న - హరి హరీ ! ఎందులకు నిందించెదరు? నే నెన్నఁడైన మిమ్ము పల్లెత్తుమాటాడి యెఱుఁగుదునా ? మీరు ప్రభువులు, నేను దాసిని. మిమ్ము దండించుటకు నా కధికారము గలదా ?

శంక - అధికారము లేదని అణఁగియుంటివిగాని, తాఖతుగలిగినచో దండింతువు కాఁబోలు నేమి ?

అన్న - నాధా! వచ్చినదే తడవుగ నన్నిట్లు వాయఁ దిట్టుటకు నే నేమి యపరాధము చేసితిని ?

సీ. పతికన్న వేరుగా పరదైవతము నాకు
               గలుగఁబోవఁ డటంచుఁ దలఁచుకొంటి,
    నాథునిపదపూజనంబె నా కిహపరో
               త్తరణమౌ గతిగాఁగ నరసికొంటి,
    ఈ యనాధకు హృదయేశ్వరముఖదర్శ
              నమె ప్రమోదం బని నమ్ముకొంటి,
    ఎట్టికష్టము లావహిల్లిన మీయండ
              వీడని ధైర్యంబుతోడ నుంటి,

     నిష్కళంకమైన నిర్మలభ క్తితో
     సతము మిమ్ము పూజ సల్పుచుంటి,
     నట్టి పాదదాసి నగు నన్ను నిష్ఠుర
     భాషలాడ నాదుపాప మేమి?

శంక --హహ్హహ్హహ్హహ్హ ! వెఱ్ఱిదానా ! అన్నపూర్ణా ! ఈమాత్రమునకే దుఃఖించుచుంటివా ? ఊరక పరిహాసమునకై నిన్నిట్లంటిని గాని,