పుట:Rangun Rowdy Drama.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము

107

(12) అన్నపూర్ణ.

కాఫీ - ఆది.

కరుణింపుమా | నానాయనా ||క||
నీసుతన్ నేగానా ||క||
చరణముగడిగియు | శంకరునకు నను | పరిణయ మొనరిచి |
మఱచితివే యది |క||

(13) అన్నపూర్ణ.

యమునా కళ్యాణి – ఆది.

ఓవాసుదేవా | శ్రీనివాసా ||ఓ ||
దేవాదిదేవా | దివ్యప్రభావా || ఓ ||
హంతకుఁడగు నాయాత్మవిభునిపై | పంతగింపకుమా! పటుకృప
నేలుమా ||ఓ

(14) డైలాగు.

కాఫీ — దాద్రా.

శంక - అధరమధుర చుంబనం "బహా ప్రమోదమూ | నీ | సుధామోహ
         మానసం | బాహూ వినోదమూ ||అ.
ప్రభా - నీసుందరంబూ | ప్రియబంధురంబుగా | ఆశదీర మోదమా
         ర | ననుభవించి | భువి సుఖంతుగా || అ||

(15) డైలాగు.

బ్యాగ్ - ఆదితాళము.

మోహ - ఈగతి భయమేటికి మదిగొనెదవు | నా గురుభుజబల మె
            ఱుఁగవుగా | ఈ ||
కృష్ణ - ఓరి కుమారక మారువాడియన | నేమని నీమది దలచితివో!