పుట:Rangun Rowdy Drama.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధములు.

(1) అన్నపూర్ణ.

నా ! ప్రియవిభునినడత గనగా | మది వగపుగాన్పింప! నా||
సరాశసునిగతి ! సురాపానరతి | దురాత్ములగుహితులు బెనగొన దిరుగు! నా|
ఇకనేమిసేతు | నెటువలెసైతున్ | ఈదురంతంబగు నడతన్ కా
పాడగ నేవారలు | కాన్పింపరె | నాప్రాప్తికి|| నా.!

(2) డైలాగు.

ముఖారిరాగం - ఆదితాళం.

అన్న - నాధా నాతోడనీకిటు | వాదా కులకాంతలకు బాధాకరంబు
         గాదా అఅఅఅఅఅఅఅ నా||
         మాన్యుండౌజనకుండు మరణింపఁగా ! సుంతైన నీమదిచింతనం
         దవేల | పలుగాకులగు లోకు లిది విన్న నపకీర్తి !! నా |

శంక -- మూఢమతివి నిరుత్సాహ మొనరించితివే ననున్ | నిను కను ! లనుఁ గనఁజాలను | గృహమే నరకంబు! ఛీ!

అన్న - .......................||| నాధా! --

(3) రాధాబాయి.

కాఫీ రూపకం.

నేనుగదా | అప్‌టూడేట్ (up to date) | ఫ్యేషణ్ (Fashion)

గలనారినీ ఫ్యేషణ గలనారినీ | ఆషకుల మిఠారినీ: 'నే!

పోకులో | ఠీకులో | నా కెవరు సమానులూ, నే

ఫుల్ మూన్ | లైటు (Full moon light) నాదువదనమూ |