పుట:Rangun Rowdy Drama.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

రంగూన్‌రౌడీ.

యెవ్వఁడో, హంతకుఁ డెవ్వడో గుఱుతింప లేవా ? నిరపరాధులను వధించుటకా ఈన్యాయాధికారములు, యీన్యాయపీఠములు యేర్పడినవి ? అయ్యయ్యో ! అన్నపూర్ణా ! నాయన్నపూర్ణా ! నీగొంతుకోయ సిద్ధమైన యీపాపిని రక్షించుటకేల బలి యయ్యెదవు ? నాభాగ్యలక్ష్మి ! నన్ను వదలిపోకుము. నీయాయుర్దాయమునుఁ గూడ పోసికొని యీపాపాత్ముఁడిఁక బ్రదుకలేఁడు. రమ్ము; రమ్ము. ఆపాపప్రదేశమునుండి క్రిందికి రమ్ము; నన్ను చచ్చి శాశ్వతవిశ్రాంతి నందనిమ్ము. ఓన్యాయాధిపతీ ! న్యాయాధిపతీ ! చూచెదవేల నయ్యా ? ఇది నీకు పాపమయ్యా ! సాధ్విని చంపుచుంటివిసుమా ! రత్నమును కాలరాయుచుంటివి సుమా ! శిరీషపేశలకుసుమమును సన్నెకంట నూరుచుంటివి సునూ ?... ... ... ఓ పాపాత్ముఁడా" ! నామాట వినవా ! అన్నపూర్ణహత్య నాపవా ! ఆపవా ! నాకన్న నీవే ఘోరహంతకుఁడ వౌదువుసుమా ! నామాట విను; విను. ఆపుము; హత్య నాపుము.

జైలు — వీలులేదు. కిరాతుఁడా ! ఇదే తుదియాజ్ఞ ! ఇక నాలసించుటకు వీలులేదు. కానిమ్ము.

(కిరాతుఁడు అన్నపూర్ణను వధించును.)

శంక - హా! అన్నపూర్ణా! (భూమిపైఁబడి నెత్తురు క్రక్కిమరణించును.)

సంపూర్ణము.


__________