పుట:Rangun Rowdy Drama.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము.

101

శంక - అయ్యా ! వలదు. వలదు. ఈమే యనృతములాడుచున్నది. పాపాత్ముఁడనగు నన్ను రక్షించుటకై అనృతములాడుచున్నది; మహాసాధ్వి. న్యాయమును పరిపాలింపుము. నేనే హంతకుఁడను, జారుఁడను, చోరుఁడను. అట్లు న్యాయాధికారుల కెఱుకపఱచి యున్నాను. నన్ను వధింపుఁడు- సిద్ధముగానున్నాను.

జైలు - శంకరరావ్ ! ఈరెండుహత్యలకును యీమె వధింపబడక తప్పదు. నీవును హంతకుఁడవేయైనను, రాజశాసనమైనపిదపఁ గాని నిన్ను వధించుటకు వీలులేదు. కిరాతా ! నీపనికానిమ్ము,

(కిరాతుఁడు కత్తినెత్తును.)

శంక - (కోపముతో) నిలుపుము. కిరాతుఁడా ! నిలువుము. ఓయుద్యోగీ! నిజమైనహంతకుని వదలి నిరపరాధులను వధించుటయా నీ న్యాయము ? ఛీ ! ఇట్టి యన్యాయబద్ధమైన శిక్షాస్మృతియేల ? తగులఁబెట్టనా ? నన్ను వధించుట కధికారము కావలెసంటివి ! మంచిమాటయే ! అంతవర కీవధను నిలిపివేయుము. రాజశాసన మిప్పుడే నీకు చేరఁగలదు. నామాట విశ్వసింపుము. న్యాయమును పాలించినవాఁడ వగుదువు.

జైలు - ఈహత్యను నిలుపుటకు నా కధికారములేదు.

శంక - లేదా ? లేదా నీకధికారము? (ఏడ్చుచు) నాఅన్నపూర్ణ - సాధ్వీశిరోరత్నమగు నాయన్నపూర్ణ - అపరాధము నెఱుంగని నాయన్నపూర్ణ — అన్యాయముగ అతిఘోరముగ వధింపఁబడుటను పాపాత్ముఁడనగు నేను నాకన్నులతోఁ జూచి భరింపఁగలనా ! ఇంక న్యాయమెక్కడ? అన్యాయమెక్కడ ? న్యాయా న్యాయములను గురుతింపలేని గుడ్డిపందయగు న్యాయాధికారి యెవ్వఁడో వ్రాసినతీర్పు ననుసరించి యెఱిఁగియుండియు నీ వీ ఘోరకర్మము నాచరింతువా ? కన్నులు లేవా నీకు ? ద్రోహి