పుట:Rangun Rowdy Drama.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంగూన్ రౌడీ

అను

పతిభక్తి.

ప్రథమాంకము.

రంగము- 1.

అన్నపూర్ణ మందిరము.

[అన్నపూర్ణయును, బాలునెత్తుకొని దాసీ లక్ష్మియు ప్రవేశము.]

అన్న--

[అనుబంధము- 1.]

లక్ష్మి - అమ్మా! ఎందులకు విచారించెదవు? బాబుగారి నడత లోపము తప్ప మీ కెట్టికొఱంతయైనఁ గలదా ? లక్ష్మీ సంపత్కర మగు నీ సుందరమందిరములు, కంతుజయంతవాసంతకే రంగము లనందగు నీయుద్యానవనములు, ధనదునిసవనిధుల ధిక్కరించు ననంతమైన భాగ్యసంపదయు, ఆపాదమస్తక మలంకరించుకొనినను ఏడువారములకు సరిపోవు నెనలేని సువర్ణాభరణములును, రతీసతిని ధిక్కరించురూపసంపదయుఁ గలిగిన నీ కేల విచారము తల్లీ!

అన్న — ఓసి వెఱ్ఱిదానా ! భారతమహిళల పరమధర్మ మేమో గుఱుతింపక మాటలాడితివిగదా! ప్రపంచమున హైందవకాంత వాంఛింపఁదగిన వివే యనుకొంటివా? పతి నిరాకరింప, పిశాచమువలె నొంటరినై, యీ దివ్య సౌధములలో సంచరించినంతమాత్రమున, నా హృదయమునకు సౌఖ్యముగల్గు నను కొంటివా ? భర్తృవిసర్జితనై, యీ మొండిశరీరముతో నీదివ్యవనవాటికలలోఁ