పుట:Rangun Rowdy Drama.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము.

93

గంగా - శత్రుఁడు గాడు - అల్లుడు. కోప మెందుకమ్మా! సైతాన్ వొదిలిపోతే చాలు ననుకొంటున్నాను.

రాధా - అయితే బాబా ! ఇదిగో ! దర్వానే జయరాం (మీసములు లాగివేయును.)

జయ - దర్వానే జయరామైతే, పోలీసే కృష్ణమూర్తి. ఇద్దఱం ఇక్కడే వున్నాం. మామగారూ ! మీదయ - మాభాగ్యము.

(కృష్ణమూర్తి వేషము తీసివేయును.)

గంగా - ( తెల్లబోయి) ఆరి దొంగముండాకొడుకుల్లారా ! ఇద్దఱూ చేరి ఇంతపని చేశారా!

కృష్ణ - సేట్‌గారూ ! క్షమించాలి. మేము చేసినపని మీ కెప్పుడూ అపకారం కాదు. మీకు జెయిలూ, అన్యాయమువలన గలిగే పాపమూ - ఈరెండూ లేకుండా రక్షించాము.

గంగా - అయితే, సైతానింక రాదుగదా ?

కృష్ణ - రాదు.

గంగా - జెయిలులోకి పో నక్కఱలేదు గదా?

కృష్ణ - లేదు.

గంగా - అరే ! నే ననుకొన్నంతా అయింది. హర్వానే దర్వాన్ - దర్వానే సైతాన్.

జయ - దర్వానే సైతాను గాదు ! దర్వానే జయరాం.

కృష్ణ - అదీ కాదూ ! దరవానే దామాద్.

గంగా - సరే. జరగవలసిన దంతా జరిగింది. ఇప్పుడు నా కేమిసెలవు !

కృష్ణ — మీరు సంతకం చేసినకాగితం ఎలాగూ చలామణీ కావలసినదే ! కనుక శంకరరావు కుమారునికి ఆస్తి అప్పగించే భారము నాది. రాధాబాయికీ జయరామునకూ ఇప్పుడే పెళ్ళి చేసేద్దాం.

గంగా - సంతోషం. అయితే ఇదే శుభముహూర్తం, కానివ్వండి.