పుట:Rangun Rowdy Drama.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

రంగూన్‌రౌడీ.

కృష్ణ — జల్దీ ; జల్దీ ; కానివ్వండి. ఆట్టేసేపు నే నాగేవాఁడను గాను.

గంగా - తాళవోయ్ ఱంకుమగఁడా ! తెయితక్క లాడతావేమి ? దర్వాన్ ! ఇపుడు నామన స్సెంతమాత్రం స్వాధీనంగా లేదు. పెద్ద గందరగోళంలోపడి కొట్టుకుంటున్నాను. ఆకాగితం కూడా నీవె రాసెయ్యి. సంతకంపెట్టేస్తాను.

జయ - చిత్తము- (కాగితం వ్రాసి) చిత్తగిస్తారా !

గంగా - (చదివి) అంతా సరీగా వుంది. అయితే-ముందువిధాన మేమిటో, ఆజయరాంకూడా ఇప్పుడే వస్తే ఆస్తి అంతా ఆతనికి ఒప్పగించి, పెళ్ళిచేసి పెందలాడే దారి చూచుకుందును. ఇదిగో సంతకం చేస్తున్నాను.

(చేయును.)

[ నాందీబాయి - రాధాబాయి ప్రవేశము.]

రాధా - నాన్నా ! ఏమి టీగడబిడ ? మనింటికి పోలీసు లెందుకొచ్చారూ?

నాంది - ముఝే ప్యారా ! ఏ గడబిడ్ క్యా హై ?

జయ - ప్యారాకూ ప్యాదా పకడ్ జాతా హై !

గంగా -- ఖూనీకేసులో పోలీసువాళ్ళు జెయిల్లోకి లాక్కుపోతున్నారు. చేసినపాపాల కన్నిటికీ చెప్పుదెబ్బలు కొట్టుకున్నాను. శంకరరావు ఆస్తి అతనికొడుక్కు రాసిచ్చేశాను. సైతాన్ను వదిలించు కోవడానికి - రాధాబాయిని జయరాము కిచ్చి పెళ్ళిచేస్తాను. ఆసంగతికూడా కాగితంలో రాయించేసి సంతకం చేశాను.

రాధా -- నిజమేనా ! బాబా! నిజమేనా?

గంగా - అంతా నిజమే. ఇదిగో సంతకంచేసిన కాగితం. దర్వాన్ దగ్గరే ఉంది. ఐతే నేను జెయిలుకు వెళ్ళకముందే జయరామ్‌గాడొస్తే పెళ్లిచేసేద్దును.

రాధా - బాబా ! జయరాంసింగును తీసుకొస్తాగాని శత్రువుఁడని కోపపడవుగదా?