పుట:Rangun Rowdy Drama.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

రంగూన్‌రౌడీ.

గంగా - అరే! నువ్వొకఁడవు. శనిలాగ. నాకెక్కడ దాపరించావురా?

కృష్ణ -- ఏమిటీ ! ఆలస్యం. చేతులకు బేడీలు వేయాలేనా ? తిన్నగా ఠాణాకు నడుస్తావా?

గంగా - అయ్యో బాబో! ఇ దెక్కడిగ్రహచారము ?

కృష్ణ - కల్లబొల్లి యేడ్పులు కట్టిపెట్టి నడు నడు.

గంగా - నేను, ఖూనీ చేయలేదయ్యా! ఉంగరం తిని, ఆముండేచచ్చింది..

కృష్ణ - ఆసంగతి కోర్టులో చెప్పుకుందువుగాని పద—

గంగా - అయ్యో ! దర్వాన్ !

జయ - అరే! భగవాన్ !

గంగా - ఇప్పుడేం చేయ మంటావు ?

జయ - బాబూ ! ఇది ఖూనీకేసు - ఉరిశిక్షో, ద్వీపాంతరవాసమో తప్పదు. జమాఖర్చులు అప్పగింతలు పెట్టి చల్లగా దారిచూచుకోండి.

గంగా - శంకరరావుఆస్తి అంతా అన్యాయంగా ఛపాయించేశాను. ఆపాపంచేతనే సైతాన్ కూడా వెంటబడ్డది.

జయ - అయితే అందుకు విచార మెందుకు మహరాజ్ !

గంగా - విచారపడక యేంచేయ్యమంటార్,

జయ - వెళ్ళేవా రెల్లాగా జైలుకు వెళుతూనే వున్నారు. ఈ పాపం కూడా వొకటి మూటగట్టుకొని వెళ్ళడ మెందుకూ! శంకరరావు భార్యా, కుమారుడు క్షేమంగానే వున్నారు. కనుక వారి ఆస్తి వారికి రాసిచ్చేయండి, మీకుటుంబానికి మీ ఆస్తెయెక్కువ---

గంగా - సరే! ఆపాప మొకటి పరిష్కారమై పోయింది. మఱి సైతాన్ సంగతి యేమిటీ!

జయ - నేను ఒకవుపాయం చెపుతాను. కోపపడకపోతే-

గంగా - అన్నికోపాలూ అణఁగిపోయి జెయిల్లోకి సిద్ధంగా వున్నాను. ఆవుపాయ మేమిటో శీఘ్రంగాచెప్పివేయి -