పుట:RangastalaSastramu.djvu/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతాపరుద్రీయంలోకూడా అంతర్నాటకము కధానిర్వఃహణకు తొడ్పడింది. అంతర్నాటకము చూస్తున్న డిల్లీ సుల్తాన్ ఒంటరిగా యుగంధరునకు బందీ అవుతాడు. "నాటకం" అనే నాటకంలో అంతర్నాటకం ద్వారా కధానాయకునకు నాయిక శీలమ్మీద కలిగిన అనుమానము తీరిపోగా, తిరిగి అతడామెను స్వీకరిస్తాడు.

హామ్లెట్నాటకంలోని అంతరానటకం ద్వారా రాజహంతకుడు హామ్లేట్ పినతండ్రి అని రుజువై, హామ్లెట్ మనస్సులోని అనుమానము నిజమవుతుంది. అంతర్నాటకం ద్వారా తమగుట్టు బయట పడిందని హామ్లేట్ తల్లి అతనిని తన గదికి పిలిపించి మాటాడుతుంది. అక్కడ దాగిఉన్న మంత్రిని రాజనిభ్రమించి హామ్లేట్ చంపడంతో అతని పధకము భగ్నమై, పతనము నిశ్చయమవుతుంది. ఇట్లా హామ్లేట్ లోని అంతర్నాటకము పరాకాస్ఠకు దారి తీసినది.

ప్రధాననాటకానికి సంబందించినదై, అందులో దృశ్యమానంకాని పూర్వొక్తగాధను అంతర్నాటకం ద్వారా దృశ్యమానము చేయడం ఇంకొక ప్రయోజనము. ఇట్లాంటివే హామ్లెట్ లో రాజు హత్యాగాధ, ఉత్తరరామచరితలో కుశలవుల జననగాధ.

సుప్రసిద్ధాలైన అంతర్నాటకాలను జాగ్రత్తగా పరిశీలిస్తే నాటకలక్షణాలు అంతర్నాటకంలోకూడా గోచరిస్తాయి. అంతర్నాటకము ప్రధాననాటకంతో పెనవేసుకొని విడివడరాని భాగమై నాటకంవలె పంచసంధులతో ఒప్పారుతూ ఉంటుందని తేలుతున్నది.

నాందీ ప్రస్తావనలు

ఏ కార్యానికైనా ప్రారంభంలో దైవపూజ, ప్రార్ధన చేయడం భారతీయ సంప్రదాయము. ఈ సంప్రదాయం ప్రకారమే సంస్కృత రూపకాలు కూడా దైవప్రార్ధనతో ప్రారంభమవుతాయి. దీనినే 'నాంది ' అంటారు. నాంది అంటే సభ్యులను రంజింపజేసేది అని అర్ధము. దీనిని సూత్రధారుడు (ప్రయోక్త-నాటకప్రదర్శనాన్ని నడిపేవాడు) పఠిస్తాడు. ఈ నాందీశ్లోకము ఆశీ:పూర్వకంగాని, సమస్కారపూర్వకంగాని అయి, 8, 12, 18, 22 పదాలతో శోధిస్తూఉంటుంది. అంతేగాక రూపకంలోని విషయాన్ని సూచిస్తుంది. ఈ సూచన శబ్ధసామ్యం వల్లగాని, అర్ధవిశేషంవల్లగాని సిద్ధిస్తుంది. స్వప్నవాసవదత్త నాటకంలో--