పుట:RangastalaSastramu.djvu/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కృత రూపలక్షణాలు

8.ప్రియుని తనవద్దకు రప్పించుకొనునది లేదా ప్రియునివద్దకు వెళ్లునది అభిసారిక.

నాయక సహాయులు

1.పెఠమర్దుడు: ఉపకధకు నాయకుడై ప్రధాననాయకునికంటె కొంచెము తక్కువగా అన్ని గుణములు కలవాడై, నాయకుని భక్తివిశ్వాసాలతో అనుసరించిఉండె సాహాయడు పీఠమర్ధుడు.

ఉదా|| రామాయణంలో సుగ్రీవుడు.

2.విటుడు: నాయకుని గీరాది8 విద్యలతో రంజింపజెసేవాడు విటుడు

ఉదా|| నాగానందంలో శేఖరుదు.

3.చేతుడు: సంధానకుశలుడు, మాటనేర్పరి, నాయక సహాయడు చేటుడు.

4.విదూషకుడు: వికృతాకారభాషాచేష్టాదులతో హాస్యాన్ని ఉద్యింపజేస్తూ నాయకుని మనస్సును రంజింపజేసే నర్మసచివుడు విదూషకుడు. ఇతడు వొక్కొక్కప్పుడు నాయికానాయకులకు సంధానకర్తగా కూడా వ్యవహరిస్తాడు. ఈ పాత్రను ఆంగ్లంలో క్లౌన్ (clown) అనీ ఫూల్ (fool)అనీ వ్యవహరిస్తారు. సంస్కృత రూపకాలలో ఈ పాత్ర ఎక్కువగా తారసిల్లుతుంది.

విదూషకపాత్ర కేవలము వినోదపాత్ర కాఫడానికి మరొక కారణము కూడా చెబుతారు. పూర్వము ప్రతి నాటకసమాజానికి అయిదుగురు ప్రధాననటులు ఉండేవారనీ, అందులో హాస్యము చెప్పే నటుడు ఒకడనీ, అతడు ప్రదర్శనము మధ్యమధ్య హాస్యము చెప్పేవాదనీ, ఆపాత్రే రానురానుల్ విదూషకుడుగా పరిణామము చెందిందనీ చెబుతారు.

రసములు

మానవునిలో అనేకభావాలు జనిస్తూ ఉంటాయి. కాని వాటిలో కొన్ని త్వరలోనే సమసిపొతాయి. అట్లా సమసిపోకుండా స్ధిరంగా నిలిచిపోయి క్రమక్రమంగా తీవ్రమయి, పరాకాష్ఠకు చేరుకొన్న భావాలను స్థాయిభావాలంటారు. ఈ స్ధాయిభావమే రసానుభూతికి అవలంబము.. రసానుభూతికి ఆధారమని సామానార్ధంలో తీసుకోవచ్చు.