పుట:RangastalaSastramu.djvu/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుది పరిశీలన

ప్రతి అభ్యర్ధి విషయంలోను పాత్రానుకూల్యము క్షుణ్ణంగా పరిశీలించవలె. ఈదశలో ఆపాత్రకు ప్రాముఖ్యమిచ్చేవీ, నటనకు కష్టంగా ఉండేవీ అయిన సన్నివేశాలను అభ్యర్ధిచేత నటింపజేసి, అతని8 సామర్ధ్యాన్ని నిశితంగా పరిశీలించవలె. దర్శకుడు అవసరమైన సూచనలిచ్చి, అభ్యర్ధి వాటికి ఏ విధంగా రూపకల్పన చేసి, ప్రదర్శించేది గమనించవలె. నాటకంలో పాత్ర మన:స్థితి విభిన్న సన్నివేశాలలో విభిన్నంగా ఉంటే, అట్లాంటి అన్ని రకాలైన సన్నివేశాలలోను, నటునిసామర్ధ్యము పరిశీలించవలె. విభిన్న మన:స్థితులను ప్రకటించే సామర్ధ్యము నటునికి ఉంటేచాలు. క్రమంగా శిక్షణద్వారా దర్శకుడు అవసరమైన, తక్కిన ప్రక్రియలను సాధించవచ్చు.

ఈ విధమైన పరిశీలన వల్ల నటుని అభినయ ప్రజ్ఞ చాలా వరకు దర్శకునికి బోధపడు;తుంది. నటుని కంఠస్వరము ప్రేక్షకులందరికీ వినిపించే శక్తి కలిగి ఉన్నదా అనే అంశము దర్శకుడు పరిశీలించవలె. ఇవిగాక, కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా అవసరమౌతాయి. ఉదా|| ఉద్వేగ ప్రకటన, స్వచ్చమైన ఉచ్చారణ, మాండలికమైన ఉచ్చారణ, సంగీతజ్ఞానము, నృత్య వివేకము మొదలైనవి; పౌరాణిక చారిత్రిక నాటకాలలో పాత్రోచినమైన శరీర సౌష్టవము మంచిరూపము, ఖడ్గ మల్ల యుద్ధాలలో ప్రావీణ్యము మొదలైనవి. వీటికై ప్రత్యేక పరిశీలన జరగవలె. ఈ దశలో దర్శకుడు ఇతర సభ్హ్యుల అభిప్రాయాలు, సలహాలు సూచనలు తీసుకున్నా తురి నిర్ణయాలు తానే తీసుకోవలె.

నటీనటులు వారు ధరించే పాత్రలకు అనురూపులై ఉండటమేగాక, సమష్టి దృశ్యంలో కూడా, ఆ పాత్రలకి తగి ఉండవలె. ఒకే పోలికలు, ఒకే రమమైన కంఠస్వరాలు గల నటులు, ఒకే నాటకంలో పాత్రలు దరించడం, నాయక పాత్రధారి అయినా నాయికా పాత్రధారిణి కన్న పొట్టిగా ఉండటం, మల్లయుద్ధం లొ ఓడిపోయే పాత్ర గెలిచే పాత్రకన్న కండలు తీరిఉండి, బలవంతుడుగా కనిపించడం వంటివి సమంజసం కాదు,

పాత్రనిర్ణయంలో చేయవలసిన పరీక్షలు

1. ఉచ్చారణ నిర్ధుష్టతకు, భావస్పూర్తికి పఠన పరీక్ష (reading-test)*