పుట:RangastalaSastramu.djvu/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రసమ్మేళనంలో వైవిధ్య మెంతో అవసరము. పాత్రకు భంగిమలో వైవిధ్యము, సన్నివేశానికీ సన్నివేశానికీ సమీకరణలో వైవిధ్యము, దర్శకుడు తన ఊహాశక్తిని వినియోగించి సాధించవలె. దృశ్యానికీ దృశ్యానికీ ప్రేక్షకసమర్పణ కావలసిన భావార్ధాలు ఒకటే అయినా, సమీకరణ పద్ధతులు మార్చడంవల్ల నాటకము మరింత రక్తిగట్టే అవకాశా లేర్పడతాయి. ఒక్కొక్క నాటకంలొ వైవిధ్యంగల సుమారు 200 పాత్రసమ్మేళనాలు అవసరము కావచ్చు.

ప్రదేశాలద్వారా వైవిధ్యము

సమ్మేళనంలో వైవిధ్యము, రంగస్థలంమీద ప్రదేశాలు దృశ్యానికీ దృశ్యానికీ మార్చడంవల్ల సాధించవచ్చు. మొదటిపాత్రసమ్మేళనానికి రంగస్థలంలొ ఒక ప్రదేశము ఉపయోగించి, ఆ తర్వాతి సమ్మేళనానికి రంగస్థలప్రవేశమంతా ఉపయోగించి, ఆ తర్వాతి సమ్మేళనానికి రంగస్థలప్రవేశమంతా ఉపయోగించి, మూడవ సమ్మేళనానికి మూడువంతులు మాత్రమే ఉపయోగించి, తిరిగి నాలుగవదానికి మొదటి ప్రదేశాన్ని వదలిపెట్టి, మరొక ప్రత్యేక ప్రదేశంలో ఏర్పాటుచేసి- ఈవిధంగా వైవిధ్యాన్ని సాధించవచ్చు. రంగస్థలంలొని అభినయావరణల (acting area) తో విభిన్న ప్రదేశాల జోడింపు, ప్రత్యేక ప్రదేశాల ఎన్నిక మున్నగు ప్రక్తియలద్వారా అనేకవిదాలైన సమ్మేళనాలు పదేపదే చేయటం ఇన్ని అవకాశలున్నప్పుడు క్షంతవ్యము కాదు.

ఒకసన్నివేశాన్ని తక్కువ ప్రాముఖ్యంగల ప్రదేశంలో ప్రారంబ్నించి క్రమేణా వైవిధ్యంగల సమ్మేళనాలు చేసుకొంటూ ప్రాముఖ్యంగల ప్రదేశానికి చివరికి తీసుకొనిరావటం ఒకపద్ధతి. దిగువమధ్య (DC) ప్రదేశాన్ని అతి ముఖ్యమైన సన్నివేశాల నిర్వహణకే ప్రత్యేకంగా, పొదుపుగా వాడుకొవడం మంచిది. మిగతా సన్నివేశాలలో, అవసరాన్ని అనుసరించి, ప్రాముఖ్యంలేని పాత్రల స్థానాలకు, సన్నివేశం మార్పులకు పనికివచ్చే దృశ్యాలకు ఉపయ్జోగించవచ్చు.

ఒకేరంగాలంకరణ (set) ప్రదర్శించే నాటకాలలో, నాటకాంతానికి ఒకప్రత్యేక ప్రదేశము దిగువ ఎడమ (DL) లేదా ఎగువకుడి (UR) కేటాయించుకొని, ఆచరణలో పెట్టడం ప్రేక్షకులకు కొంత కొత్తదనాన్ని అందించగలదు.