పుట:RangastalaSastramu.djvu/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివరణ

రేఖయొక్క ఎత్తు నాటకప్రదర్శన జరుగుతూ ఉన్నప్పుడు ప్రేక్షకానురక్తిస్థాయిని సూచిస్తుంది. చుక్కలగీతలు తప్పులను తెలియజేస్తాయి.

A. పూర్వోపోద్ఃఆతసమయము: ఎక్కువ అనురక్తి సాధనకు అవకాశము లేదు: అట్టి ప్రయత్నము మనవసరము.

B. ఉపోధ్ఘాతము: ఇది అనురక్తికి అనుకూలమైనది కాదు. కొన్ని చెణుకులు ప్రయోగించి ప్రయత్నపూర్వకంగా అనురక్తి సాధించవలె.

C. ఇక్కడనుంచీ నాటకంలొ ప్రేక్షకానురక్తి ప్రారంభమవుతుంది. ఇది దర్శకుడు పరిశీలనద్వరా తెలుసుకొని ఉండవలె. ఇది సాధారణంగా ఒక ముఖ్య పాత్ర ప్రవేశంతో ప్రారంభము కావచ్చు.

D. ఈ మొదతి సన్నివేశము మరీ నాటకీయము చేయటంవల్ల తరువాతి దృశ్యము జడంగా. విసుగుదల కలిగింఛేదిగా ఉంటుంది.

EHJ. తెర పడే సమయాలు. తెర పదేటప్పుడు ఆసక్తి హెచ్చడం. తెర ఎత్తేటప్పుడు తగ్గడం గమనించవలసిన విషయాలు.

F. నాటకీయ సన్నివేశము తరవాత అనురక్తి తగ్గదు. సాధారణంగా ప్రధాన పాత్ర నిష్క్రమణవల్ల జరుగుతుంచి.

G. దీర్ఘనిర్మాణము

I. పరాకాష్ట మరీ చప్పున అందుకోవటంవల్ల తక్కినదృశ్యము విసుకు కలిగిస్తుంది. తెర పడేముందుదాకా ఈ పరాకాష్ట అదుపులో పెట్టటంవల్ల సరియైన ఫలితము వస్తుంది.

K. ప్రధా పరాకాష్ఠ (సాధారణ నాటకంలో)

L. ప్రధాన పరాకాష్ఠ (బరువైన నాటకంలో)

N. ప్రధాన పరాకాష్ఠ తరవాత దిగువిఅన నడక, నిర్మాణము, ప్రధాన పరాకాష్ఠ నాటకాంతంలో ఉండడం చాలా అవసరము. ఇది లేనిదే నాటకంలో ప్రేక్షకులకు ఆసక్తి ఉండదు.