పుట:Ranganatha Ramayanamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాలోచనము

7

నాడని నుతియించిన పద్యములన్నియు నాంధ్రసాహిత్యపరిషత్పత్రికయందు నింతకుముందే ప్రకటించియున్నాఁడను. జాతిభేదములు పాటింపక గుణగ్రహణపారీణతనే పాటించు నాకాలమున నిందఱు మహాకవులు ఇట్లు పొగడుటకు గారణ మేమి యని యాలోచించిన బుద్ధిమంతులు గ్రహింపఁగలరు. "అసతి కుడ్యే చిత్రలేఖన" మన్నట్లు ఇంతమంది మహాకవులు పొఱఁబడరని రంగనాథమహాకవి ద్విపదకావ్య మన భారతకవులప్రఖ్యాతిని గోరి రచించెనని గ్రహించుట బుద్ధిమల్లక్షణము.

ఇప్పటికిని నాముక్తమాల్యద పెద్దనప్రణీత మనువాదము నెగడుచున్నది గదా? కావున నిది రంగనాథప్రణీత మనుట నిస్సంశయము. పట్టుబట్టి యిపుడు బుద్ధారెడ్డి వ్రాసెనని పాఠ్యగ్రంథములలోను, విద్యార్థులు చదువు టిప్పణముల (Notes) లోను బలవంతముతోఁ జొప్పించి సినిమాప్రదర్శనములవలన భాషకును, గథాసంవిధానములఁ బురాణములకును విభేదము పుట్టించి నీతిని, జాతిని, తెలుఁగుభాషకుఁ గల కీర్తిని మంటఁ గలుపుచున్నట్లే యిప్పటి చారిత్రకపరిశోధకులగు పదవీసిద్ధులు చేయు యత్నములని యెంచుట విజ్ఞుల లక్షణము.

ఈ గ్రంథము మొదటి ప్రతాపరుద్రుని కాలములో రచియింపఁబడినదని తెల్పుదురు. ఈ ప్రతాపరుద్రుఁడు 1200 వత్సరప్రాంతమున రాజ్యముచేసినవాఁడు. గోన బుద్ధారెడ్డి దూపాడు పరగణా కధిపతిగా నుండిన సామంతరా జందురు. బుద్ధారెడ్డి కూఁతురు కుప్పమాంబ. బూదపూరిలో శా॥ 1198కి సరియగు 1286 ధాతృవత్సరమున లింగప్రతిష్ట చేసి యనేకభూదానములు చేసినట్లు శాసనములు గలవు.

“శ్రీ గోనవంశనిజశేఖర బుద్ధయాఖ్య, పుత్త్రీ పవిత్రచరితా భరితాగుణౌఘైః,
శృంగారసారకరణిః కరణీయదక్షా, కుప్పాంబికా౽జనిచ తస్యసతీ కళత్రమ్"

అను శ్లోకమునఁ గుప్పాంబ బుద్ధరాజు కూఁతు రగుట స్పష్టమగుచున్నది. రంగనాథరామాయణరచన కాలమున కీమె పుట్టెనో లేదో యనియుఁ బదుమూఁడవశతాబ్దియందే ఈ రామాయణము రచింపఁబడినదనియు శ్రీవీరేశలింగము పంతులుగారి మతము. ఇది నిక్కమే యగును. ఇట్టి ప్రథితయశులకృతిమాత్రము పుత్త్రు లేల విశదీకరింపరు? ఇది రంగనాథకవికృతియే గాని యితరకృతము కాదు.

కవిత్వము - చమత్కృతి

ఆబాలగోపాలమున కందుబాటులో నుండునట్లును, వినినయంతనే యర్ధావబోధమగుటకును దగినది ద్విపదకావ్యము. హరిశ్చంద్ర, నల, రాజయోగసార, పరమయోగివిలాసములు, మున్నగునవి యెంతయు సరళముగ నుండి గ్రహించుటకు ననువుగ నుండుట యంద ఱెఱింగిన విషయమే, దీనికే దేశికవిత యందురు, కొంద ఱీదేశికవిత పశ్చిమాంధ్రుల కంటఁగట్టిరి, మంచిదే. హృదయంగమముగ నెల్లరయుల్లములు పల్లవింపఁజేయు నిట్టికవిత యెంతయు సన్నుతి కెక్కును. పశ్చిమాంధ్రమని దేశమును బిలుచుటలో నంత సామంజస్య మగపడదు. దత్తమండలములవారి నిట్టిపరిభాషకు గుఱిచేయుట యుచితము కాదు. త్రిలింగదేశమువా రనవచ్చును. తెలుఁగువా రన