పుట:Ranganatha Ramayanamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాలోచనము

5

వచ్చును గాని, యా నుతికిని దీనికిని గల భేదము విద్వద్వరు లెఱింగియే యున్నారు.

ఉత్తరరామాయణ భాగమును బుద్దరాజు పుత్త్రులగు కాచభూవిభుఁడు, విఠల భూపతి యనువారు తమ తండ్రియగు బుద్ధ భూపతి యాజ్ఞానుసారముగ ద్విపద కావ్యముగనే వ్రాసిన ట్లుండుటయు గోనబుద్ధరాజే యీ గ్రంథకర్త యగుటకుఁ గారణ మని కొందఱందురు.

బుద్ధరాజు తాను రామాయణమును రచించి తన కుమారులను బిలిపించి “నాయనలారా! నేను రామాయణమును రచించితిని. మీరు నా కుమారులు. నా కీర్తివర్ధనులు. మీరు నిపుణులై రామాయణమును జెప్పుఁ డనుటయుఁ, గుమారులు మా తండ్రి ప్రతిన చెల్లింపఁ గనుట పరమధర్మంబనియు, వాల్మీకి చెప్పినజాడ తండ్రిపేరఁ జెప్పినట్లు ఉత్తర రామాయణావతారిక యందును, గాండాంతమునను గలదు.

ఈ విషయగ్రథనము వింతగఁ గన్పట్టుచున్నది. తత్త్వదర్శకుల కియ్యది సంశయాస్పద మగుటయేగాక యిది యసంభవమనియుఁ దోఁపకమానదు.

పర్యాలోచన మొనర్పఁగా గ్రంథకర్తృత్వ విషయమున నాధునికులగు సూక్ష్మదర్శులకంటెను బ్రాచీనులగు దీర్ఘదర్శుల యూహలే సమంజస మని తోఁచగలదు. ఇతిహాసము లూరక పుట్టవు. కోనబుద్ధరాజు పదుమూఁడవ శతాబ్ది వాఁడగుట చారిత్రకకారుల మతము. ఆ కాలముననే రంగనాథుఁడను ప్రసిద్ధకవియు రాజు నాస్థానమున నుండినవాఁ డనుట స్పష్టము. రాజుగారి వాంఛ ననుసరించి ద్విపదకావ్య మగురామాయణమును రంగనాథుఁడు రచించి యాశ్రితుఁడగుట రాజుపేర వెలయించెను. అట్లే వారి పుత్రులకీర్తిని వెలయింపఁదలఁచి యుత్తరకాండమును రచించి పుత్త్రులపేర నంటఁగట్టెనేకాని బుద్ధరాజుగాని, తత్పుత్త్రులుగాని యీ కావ్యరచన గావించినట్లు గన్పట్ట దనుట నిస్సంశయము. తా నున్నస్థలమునకుఁ గీర్తిప్రతిష్ఠల నాపాదించుట విజ్ఞుల లక్షణ మగుట నిట్టి యుత్కృష్టకావ్యరచనచే స్వాశ్రయపోషణము గావించినాఁడని చెప్పుటలో నేమాత్రము లోపములేదు. ఎవరి యూహలు వారు తెల్పుటలో నేవారి కేమి భాధకము గలదు ? తండ్రివ్రాసిన గ్రంథము రంగనాథనామాంకితముగా గ్రంథము వెలయుటకుఁ గారణము కుమారు లించుకయైనఁ దెలుపకయుండుట యేల? రంగనాథుఁడు తనపేరైనను, గులగోత్రము లైనను దెలుపలే దనుటలోఁ దనకుఁ బోషకులుగా నుండువారిని గొనియాడుట యుత్తమధర్మమని ధన్యత్వమొందుట తగిన కారణమనుటలో నేలోపము లేదు. బుద్ధరాజ పుత్త్రద్వయమే యుత్తరకాండము వ్రాసియున్న సంపూర్ణముగఁ బూర్వరామాయణమున కాపేరు (రంగనాథరామాయణము అనుట) కలుగుటకుఁ గారణము వచియించి యుండకపోరు. తమగుణములు తండ్రిగుణములు, తమప్రతిభలు, తండ్రిప్రతిభలు చెప్పుటలో నింత విశృంఖలత నవలంబించియుండుట పొసఁగదు. ఆశ్రితుఁడగు రంగనాథుఁడు కావించిన యీ యవ