పుట:Ranganatha Ramayanamu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవువిక్రమమొ? యేదియుఁ గాదు; సీత - దీవెన యిది; యంచు తెలివిమై నుండి
ప్రవిమలసత్త్వైకపరులైనజనుల - భవపాశములు వీడు భావన దోఁప
బ్రహ్మమంత్రములు తప్పక యుచ్చరింప - బ్రహ్మపాశము లూడెఁ బవనసూనునకు.
అంత నాహనుమంతుఁ డసురేశులంక - యంతయుఁ గాల్పఁగ ననువు చింతించి
యలవడఁ దనకునై యగ్నిసూక్తములు - జలములలోఁ గ్రుంకి జపియింపవలయు
నని పోయి మునిగిన ట్లపరాంబురాశి - నినుఁ డస్తమించిన నేచి వాయుజుఁడు
కనకమహీధరాకారమై యొప్పు - తనమేనుఁ బెంచి బంధము లెల్లఁ ద్రుంచి
కీ డాచరించుచు గేలి సేయుచును - వేడుకతోఁ దనవెనువెంటఁ దిరుగు

హనుమంతుఁడు లఁకఁ గాల్చుట

దనుజుల నిర్జించి దనుజేశుఁ డున్న - ఘనమైనమేడ కుత్కటముగా నెగసి910
తనవాలవహ్ను లంతటఁ దరిగొల్పఁ - దనివి యంతంత కుదగ్రంబు లగుచు
భుగులునఁ బొగ లొప్పెఁ బొగలకు మున్నె - నిగిడి పెన్మంటల నిండె నాకసము;
నాకసమున మంట లడరి మండుటయుఁ - బైకొని యటమున్నె పర్వె నుల్కములు
అడరున య్యుల్కల కటమున్నె తొలగి - వడి దిక్కులకుఁ బాఱు వరవిమానములు
నప్పుడు హనుమంతుఁ డడరి యొండొండ - గుప్పించి మఱి కొల్వుకూటము ల్గాల్చి
వరశస్త్రశాలలు వడి నీఱు చేసి - యిరవంద భండారపిండ్లును గాల్చి
పరువడి సౌధము ల్భస్మంబుఁ జేసి - సొరిది చప్పరములు చూర్ణంబుఁ జేసి
మణిచంద్రశాలలు మసిగా నొనర్చి - ప్రణుతశయ్యాగేహపటలి దహించి
రమణీయగజవాజిరథశాల లోగి - కమలిచి దగ్ధము ల్గాజేసె నపుడు
ఎడపక యెగసిన యెఱమంటతునుక - లుడుగక నుడువీథి నొండొండఁ బర్వి920
ఖచరోరగామరగణవిమానములు - ప్రచురవిభాగైకపరతఁ జలింప
సొరిదిమై రావణాసురుచేటు దెల్పఁ - దొరగునుల్కల యట్లు దోఁచెఁ బెల్లుగను,
రాజన్యుఁ డగు రఘురామభూపాలుఁ - డోజమై దండెత్త నుద్యుక్తుఁ డగుచు
బలువిడి లంకలోపలఁ బ్రతాపాగ్ని - యెలమిమై నిర్గమ మిడియెనో యనఁగ
దహనుండు నిర్భరధ్వనుల బ్రహ్మాండ - కుహరంబు నిండి మిక్కుటముగాఁ బర్వె,
రావణుఁ డట ఘోరరణకళాకేళి - కావళుఁ డగుచు దిక్పాలుర నెల్ల
పఱచిన తొల్లింటిభంగము ల్మాఱు - పఱపకపో డనుభంగిని నెగసి
బలసి విభీషణుభవన మొక్కటియ - వెలిగాఁగ పుర మెల్ల వ్రేల్మిడిలోన
దరికొని మండు నత్తరి దైత్యవరులు - కరము భయభ్రాంతిఁ గంపించువారు,
తలలును జీరలు దరికొని మండ - బలమేది నలుగడఁ బాఱెడువారు;930
తమతమవారలు తమబంధుజనులు - కమలుటఁ జూచి శోకము నొందువారు