పుట:Ranganatha Ramayanamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావ్యము

కిష్కింధాకాండము

207


యేటి కంగదుఁడు? మీ రేటికి? రాజ్య - మేటికి? నాకుఁ బ్రాణేశ్వరుఁ డైన
వాలిఁ జూడక"యంచు వారి వారించి - యాలోనఁ దార తారాధిపవదన
తనమదిలో వాలిఁ దలపోసి పోసి - ఘనశోకమునఁ జనుఁగవ చూచి చూచి
యమరేంద్రసుతురాక యల్లంతఁ జూచి - సమకట్టి డాయుచు సత్క్రీడఁ గోరి
రాసిగ నాసురరాజేంద్రసుతునిఁ - బాసితి రింక నీఫలముచేఁ జేతఁ
గుడువుఁ డింతటనుండి కుచము లారనుచుఁ - గడునల్క వెస నుగ్రగతి మోదుకొనుచుఁ
బుడమి గంపింప నద్భుతశోక మడర - నెడపక నిబ్భంగి నేతేర తార
హారముల్ దెగి రాల నలివేణి దూల - భారంపుఁజనుఁగవ పయ్యెద జార
నీరజంబునను దేనియ గారినట్టు - తోరమై కన్నీరు దొరుగ నందంద
బలువిడి నేతెంచి పవనవేగమున - లలిఁ దూలి పడు పుష్పలతికయుఁ బోలె570
నావాలిపైఁ బడి యందఱుఁ బొగుల - లావేది తార ప్రలాపింపఁదొడఁగెఁ.
“గపికులాధీశ్వర! కపిరాజచంద్ర! - కమరాజశేఖర! కపిసార్వభౌమ!
సకలసురాసురసంఘంబులందు - నకలంకసత్వుండ వధినాథ! నీవు
అఱిముఱి వింధ్యాద్రు లగు మహాగిరులు- పెఱికి వేఁటాడిన బిరుదవు నీవు
బలియుఁడై త్రిభువనపాలుఁడై వెలయు - కులశైలభేదికిఁ గొడుకువు నీవు
కోలంబనునిపేరి క్రూరగంధర్వు - నేలఁ గూల్చిన రణనిపుణుండ వీవు
నీవు మానవునిచే నీచతఁ బొంది - యీవిధిఁ బడి తింక నే మనఁగలను?
ఇనతనూజుఁడు నిన్ను నెదుర లావేది - యనిలోన నినుఁ గెల్తు నని రాముఁ దెచ్చె,
రాముని ననిఁ గెల్వ రా దని యంటి - నామాట వినవైతి వామన్నిగొంటి
వామహాత్ముఁడు విష్ణు వటు పోకు మంటి - భీమశౌర్యుఁ డతండు బిరు దేల యంటి;580
నినుఁ జంప వచ్చిన నీపాలిమృత్యు - వనక రామునిచేత నారడి పడితి
వొలసి దేవాసురు లోగిఁ దర్చితర్చి - బలమఱి యటఁ బాయఁబడియున్నఁ జూచి
యడరి వాసుకి మందరాద్రికిఁ జుట్టి - వడి సముద్రము దీర్చు వరశక్తిపేర్మి
ద్రిజగంబులందును దీపించునట్టి - భుజములు పెంధూళి బ్రుంగెనే నేఁడు?
అతిసత్వుఁ డగు రాక్షసాధీశుఁ బట్టి - ధృతి విలపింప నీదృఢముష్టిఁ గట్టి
మునుకొని వార్ధుల ముంచి ముంచెత్తు - ఘనవాల మిట ధూళిఁ గలిసెనే నేఁడు?
కఱకంఠుశ్రీపాదకమలంబుమీఁద - తెఱఁగొప్ప నీమౌళి తేటియై వ్రాలు
నట్టినీమస్తకం బకట! యిచ్చోట - వట్టినేలను గూలవలసె నేమందు?
హృదయేశ! నినుఁ బాసి యే నిల్వఁజాలఁ - గలసి నీ వున్నలోకమునకు వత్తు;
వేదన నిటమీఁద వేగ పాలైతి - నాదిక్కులేమికి నా కేమి వగవ?590
గోత్రారినందన! కోరి నీకన్న - పుత్రు నంగదుఁ జూచి పొక్కెదఁ గాని
దూలితోఁ బాఱి నీతొడలపైఁ బొరలు - బాలు నంగదు నేలి పాలింపవయ్య!