పుట:Ranganatha Ramayanamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావ్యము

కిష్కింధాకాండము

203


పనిగొని సుగ్రీవు బంటుగా నేలి - యని నిన్నుఁ జంపెద నని వచ్చినాఁడు
ఆరాఘవుఁడు విష్ణుఁ డంబుజోదరుఁడు - వైరంబు గొని గెల్వ వశము గా దతని
నినసుతునకుఁ బ్రీతి నీరాజ్య మిచ్చి - చని నీవు రఘురాము సంధి గావింపు
విను మది గాదేని వీర్యంబు విడిచి - మునివృత్తిఁ జని ప్రాణమును గాచికొనుము"
అని తార పలికిన నావాలి గినిసి - "విను నాకు పత్నివై వెఱ పేల యింత?
బలశాలి యైనట్టి బలియునినైనఁ - గలన జయంబునేఁ గైకొందుఁ గాని440
పరులకు నే నోడఁ బగవాఁడు వచ్చి - పెరిగి యుద్ధమునకుఁ బిలిచినచోట
ధీరత దొఱగి సంధికి నియ్యకొనుట - వీరధర్మము గాదు వెలఁది! నా కింక
నలినలోచన! విను నాయంతవాని - బలియుఁ జేపట్టక పట్టె సుగ్రీవుఁ;
గాన రాముఁడు నీతిగలవాఁడు గాఁడు - గాన రామునిపొందు గావింపఁదగదు.
తెరలి సుగ్రీవుండు దిక్కు లేకున్న - నరిగి రామునకు బంటై చేరెఁగాక;
నా కేల రాముఁడు? నా కేల సంధి? - నా కేమిటికి వేఁడ? నలి దూలి యొకని
నామహితాత్మకుం డతిధర్మపరుఁడు - రాముఁడు నన్ను నూరక యేల చంపుఁ?
బోల వీమాటలు పోయి సుగ్రీవు - వాలాయముగఁ గ్రూరవజ్రప్రహార
మూలమై యొప్పు నాముష్టిఘట్టనల - నేలఁ గూలిచి వత్తు నెమ్మది నుండు."
మని తార మరలి పొమ్మని వీడుకొలిపి - యనిమిషేశ్వరపుత్రుఁ డగువాలి వెడలెఁ450
గలఁగొనఁ జుట్టిన కర్మపాశములు - నెలకొని దిగిచిన నిలువరాకున్న
వెడలుచందంబున వెరవును లావు - కడిమియుఁ దెంపు నుత్కటముగా వెడలి
శరధులు గలఁగ భూచక్రంబు వడఁక - గిరు లొడ్డగిల్లఁ గిష్కింధ ఘూర్ణిల్ల
గర్జించి చనుదెంచి కదిసి సుగ్రీవు - తర్జించి చూచి యుదగ్రుఁడై పలికె.
“నాతోడఁ బోరాడి నా కోడి పాటి - యేతెంచితివి యిప్పు డిటు లజ్జ మాని,
యేతెంచితే నేమి యిప్పుడే జముని - వారికి నిను నుట్రవడియం బొనర్తు
బెదరక చెదరక బెట్టుబీరములు - వదరక నొక్కింతవడి నిల్వు చాలు.
నాలంబులో ముష్టిహతి నిన్ను నేల - గూలిచి ప్రాణము ల్గొందు నే" ననుచు
నుఱుమని పిడుగుతో నుల్లసం బాడు - కఱ కైనతనముష్టి గట్టిగాఁ బట్టి
పరతెంచి పొడిచిన భానుతనూజుఁ - డొరిగి నెత్తురు గ్రక్కి యొయ్యనఁ దెలిసి460
ధీరుఁడై నిలిచి గద్దించి యింద్రజుని - కేరడం బాడి సుగ్రీవుఁ డిట్లనియె.
“నన్నవు నాకుఁ బూజార్హుండ వనుచు - నిన్నాళ్లు సైచితి నింతియే కాని
విగ్రహంబున కేను వెఱతునే తొంటి - సుగ్రీవుఁడను గాను జూచి పోరాడు.
వాలి ని న్నిప్పు డవశ్యంబు చంపి - పాలింతుఁ గపిరాజ్యపదము నే" ననుచుఁ
గడునల్గి సాలవృక్షము వేగఁ దెచ్చి - వడి నార్చి వైచిన వాలి కంపించి
పుడమిపైఁ బడి మూర్భఁ బొంది యొక్కింత - వడిఁ దేరి గర్వదుర్వారుఁడై మిగులు