పుట:Ranganatha Ramayanamu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అట నంగదుండు నుదంచితాంగదుఁడు - ఆటప్రాయముఁ గాఁగ నప్పు డావనుల
గేరులను వెస వచ్చి క్రియ నాడుచుండి - యారామసుగ్రీవు లన్యోన్యముగను
నెన్నఁగా ననలుసన్నిధిఁ బల్కుపల్కు - లన్నియు విని వచ్చి యాతారతోడ
విన్నవించిన మది వేగుచు నుండి - కొన్నిదుశ్శంకలఁ గుందుచునుండె.
నపు డర్కసుతునకు నారాఘవునకు - విపులభూరుహశాఖ విఱిచి వాయుజుఁడు

సుగ్రీవుఁడు జనకజతొడవు లిచ్చుట

ఆసనంబును వైవ నందుఁ గూర్చుండి - యాసక్తిఁ బరిణామ మరయుచున్నంత
నహిమాంశునందనుం డంత రాఘవుల - గుహలోపలికిఁ దోడుకొనిపోయి ప్రీతి190
భూమిజ మును వైచిపోయిన తొడవు - లామెయిఁ గొనితెచ్చి యప్పు డిట్లనియె.
‘‘దనుజుండు నీదేవి ధరణీతనూజ - వనసీమలోపల వంచన మిమ్ముఁ
గనుఁబ్రామి గగనమార్గంబున నెత్తి - కొని పోవఁ బోవ నీకొండపై మమ్ముఁ
గనుఁగొని మిముఁ బెక్కుగతులఁ జీరుచును - జినుఁగుపయ్యెదకొంగుఁ జించి బంధించి
తనతొడవులు వైచి తరలాక్షి పోయె" - నని చెప్పి యిచ్చిన నధిపతి చూచి
మున్నుగా వగలను మున్నీట మునిఁగి - కన్నీట నాసొమ్ము కసటెల్లఁ గడఁగి
యందంద యురమున నాభూషణములు - పొందించి పొందించి భూమిజఁ దలఁచి
పెలుకుఱి లక్ష్మణుఁ బేర్కొని పిలిచి - పలికెఁ బల్కులఁ దొట్రుపాటు రెట్టింపఁ
“గంటె లక్ష్మణ! సీత కైసేఁతలెల్ల - మంటిపాలయ్యె నిమ్మాడ్కి నేమందుఁ
నీతొడవులు వైవ నేమి కారణమొ? - యీతొడవులతోడ నేమైనయదియొ?200
యది నాకుఁ బ్రాణనాయకి యైనసీత - కుదురు నిండిన గబ్బిగుబ్బలమీఁదఁ
బాయని యీజిల్గుపయ్యెదచీర - కీయవస్థలు వచ్చె నే మనవచ్చుఁ?
బన్నీట నాపాదపద్మముల్ గడిగి - యున్నతిఁ దడియొత్తు నొప్పుగ దీన
సురటి గావించి భాసురలీలతోడ - భరితశ్రమాంబువుల్ పలుచగాఁ జేయు
మెఱుగారుమైదీగ మెఱయుచుండంగ - మఱి యడుగులకును మడుగులు వైచు"
నని యని శోకించు నశ్రులు నించు; ననయంబు మూర్ఛిల్లు; నంతలోఁ దెలిసి
ప్రియభక్తి వినమితగ్రీవు సుగ్రీవు - నయత నాథుఁడు రఘునాథుఁ డీక్షించి
“నాదేవిఁ గొనిచన్న నాకేశవైరి - యేదేశమున నుండు నెద్ది పురంబు?
చెప్పుమా సుగ్రీవ! సీత సాధింతు - నిప్పుడ దైత్యుని నే పడగింతు;"
నా విని యారవినందనుం డనియె - "దేవ! యాద్రోహిమందిరము నే నెఱుఁగ210
నెఱుఁగకుండిన నేమి? యిటమీఁద వాని - నెఱుఁగుతెఱం గెల్ల నేను గావింతు
నీవె శోకము మాని నిశ్చలధైర్య - భావగుణాస్పదపరుఁడవు గమ్ము
అతిపరాక్రమశాలి యగువాలిచేత - హృతకళత్రుఁడ నయ్యు నే నింత వగవ
నాపద యనువార్ధి నాత్మదైర్యంబు - దేవ! సేయునరుండు దెలిసి మైనుండు