పుట:Ranganatha Ramayanamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గలకంఠకలకుహూకారనిస్వనము - చెలఁగించు వనము గర్జిలు ఘనాఘనము
గులుకుపుప్పొడి మించుఁ గ్రొక్కారు మించు - దలిరుగొమ్మలు శక్రధనువులయనువు
వసుధ రాలెడివిరుల్ వక్షోపలములు - ముసరుతేనియసోన మించినవాన
గా నొప్పుచు వసంతకాలంబుఁ జూడ - వానకాలముఁ బోలి వసుధ నొప్పియును
జిగురాకుశిఖలతోఁ జిట్టాడుతేటి - పొగలతోఁ బొగడపుప్పొడిబూదితోడ30
బూరుగుపూవు నిప్పుకలతో నెగడి - యారయ విరహుల కగ్నియై నిగుడి
కంతుప్రతాపాగ్నికంటెను గడఁగి - యెంతేని నాచిత్త మెరియింపఁ దొడఁగె.
నేమి చేయుదు? నింక నెట్లు వేగింతుఁ? - గామినీమణి సీతఁ గాంతు నెన్నటికిఁ?
బంపాసరోవరప్రాంతకాంతార - సంపదతోడ వసంతంబు గూడి,
చెలువైన చందాన సీతతోఁ గూడఁ - గలుగునే నాకు నొకానొకనాఁడు?
ఈపంపలోఁ దమ్ము లేఁ జూచినట్లు - భూపుత్రివదన మెప్పుడు చూచువాఁడ?
నిందు మీననిహార మీక్షించినటుల - నిందువదనచూపు లెప్పుడు చూతు?
జలపక్షు లిచ్చట జతగూడినట్లు - జలజాక్షి నెన్నఁడు జతఁ గూడువాఁడఁ?
దేటి యిచ్చటఁ దమ్మితేనె గ్రోల్కరణి - బోటికెమ్మోవి నెప్పుడు గ్రోలువాఁడ?
నెక్కడి తలపోత? లెక్కడి సీత? - యెక్కడ వెడసేఁత? లివి యెట్లు పొసఁగుఁ?40
దమ్ముఁడ! నీ వయోధ్యకుఁ జను మింక - నెమ్మేనఁ బ్రాణంబు లిఁక నిల్పఁజాల;"
నని యనాథునిక్రియ నందంద వగవ - విని లక్ష్మణుఁడు రామవిభుఁ జూచి పలికె.
"నిది యేమి రఘురామ! యెల్లలోకములు - ముదలింపఁ బురుషోత్తముఁడ వైన నీవు
ఈమోహశోకంబు లేల తాల్చెదవు? - కామిని వంచనఁ గైకొని చనిన
రావణుఁ జంప నారంభంబు సేయు - మీ” వనితెలుపుచో నెంతయుఁ బ్రీతిఁ
గను పెంటి యెలుఁ గిచ్చె గబ్బుల్గు పలికెఁ - గనుఁగొని తచ్చెలి కలయంగ రొప్పె,
చేకొని చిఱుత దా జేరువఁ బెట్టె - గైకొందు చెలి నని కలయంగ రొప్పె;
నెల్లెడ శుభములు నిత్తు మీ కనుచు - బల్లి దీపంబుగాఁ బలికెఁ బో చెవికి
భానుపై వామాక్షి పరుసనియెలుఁగు - యాని యించుక చెవి యెంతయు రొప్పే.
దనయాత్మఁ గడుమెచ్చి తమ్మునిఁ జూచి - యినవంశవల్లభుఁ డిట్లని పలికె.50
"వనచరాధీశుండు వడి నేగుదెంచి - ఘనభక్తి మనలను గలయంగఁగలఁడు
కూలు రావణుఁ డాజిఁ గూడును సీత - నేలుదు లోకంబు లెలమి ధరింప"
నని రామసౌమిత్రు లధికసంతోష - మును బొంది సుఖగోష్ఠి ముదమందుచుండ
నాలోన సుగ్రీవుఁ డాఋష్యమూక - శైలసానువులందుఁ జరియించుచుండి
యాపంపచేరువయం దున్నరామ - భూపాలు లక్ష్మణుఁ బొడఁగాంచి వెఱచి
యచలంబుపైకి గుండనక చెట్టనక - కిచకిచధ్వనులతోఁ గిచకొట్టుకొనుచు
నెగఁబ్రాఁకి యెక్కుచో నేకాంతమందు - నగచరులకు వారి నట చూపి చూపి