పుట:RameshwaraMahatyamu.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   కవితసత్కార మొప్పగ-గారవించి|
   పలికెగంభీరభాషణ-ప్రౌడిమెరయ|| (22)

క. నిర్మలకీర్తివిస్త్కృతి|
   నిర్మాణవిశారదు డవు-నిర్మలఛందో|
   మర్మజ్ఞడవుశివార్చన|
   ధర్మపరుండవునుతింప-దరమేనిన్నున్|| (23)

వ. మదీయవిజ్ఞాపనం బవధరింపుము సపాదలక్షగ్రంధ సంఖ్యాసమే తంబును పంచాశత్ఖండ మండితంబును, బహుసం హేతో సమాకీర్ణంబునునై యొప్పు స్కాందంబును నాదిమపురాణంబునందు సేతుఖండంబు శ్రీరఘుపతి ప్రతిష్ఠిత రామేశ్వరస్వామి మహాత్మ్య సమ్యుక్తంబగుటంజేసి రామేశ్వరపురాణం బనంబరగునది యాంధ్రదేశభాషచేతం బ్రబంధంబుగావించి మదీయకులదైవతం బగు శ్రీగురుజానపల్లి మల్లేశ్వరస్వామిపేర నంకితంబుసేయుము. దీనివలనమాకును మీకును శాశ్వతకీర్తియు సకలాభ్యుదయంబులు సిద్ధించునని బహుప్రకారంబులం బ్రార్ధించెనయ్యనసరంబున. (24)

ఉ. రాజమహేంద్రదుర్గరుచి-రంబుగ దేశమునంబ్రసిద్ధిచే|
   భ్రాజిలుగాకినాడశల-పాకమహాళ్ళకు రెంటికిన్ మహా|
   తేజ మెలర్పనాస్థలప-తిత్వము గాంచినదిట్టశాశ్వత|
   శ్రీజయశాలివైరిగజ-సింహమునండురికామమంత్రియున్||
          (25)

వ. నన్నుంజూచి లక్ష్మణకవీంద్రా మల్లనమంత్రి విన్నవించిన వచనంబు లాదరించి ప్రబంధంబు రచింపుమని వినయ పూర్వకంబుగా భాషించిన నంగీకరించితి నంతట బహుమానంబుగా గర్పూరతాంబూల జాంబూనదాంబర మణిమయాభరణ హిరణ్య ధరణ్యాది మహాపదార్ధంబులిచ్చి మల్లనమంత్రి నన్నుం బూజించి వీడుకొల్పి నంజను దెంచి విరించిముఖ నిఖిలబృందారకబృంద మహనీయ హాటకకోటీర సంఘటిత మణిగుణ ప్రభాంకూర నీరాజిత చరణార