పుట:RameshwaraMahatyamu.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విందుండగు శ్రీగురుజానపల్లి చెన్నమల్లేశ్వరస్వామినిం గృతికినధీశ్వరుంగావించి రామేశ్వరమహాత్మ్యంబను మహాప్రబంధంబు నిర్మింపందొడంగితి నమ్మహాదేవునకు. (26)

షష్ఠ్యంతములు


క. శంభునకుగిరిసుతాకుచ|
   కుంభస్థలకలితలలిత-కుంకుమచర్చా|
   శుంభత్సౌరభవిభనవి|
   జృంభితవక్షునకుసవన-జితదక్షునకున్|| (1)

క. కుండలికుండలమండిత|
   గండద్వితయునకు బాండు-కరడిండీరా|
   ఖండల వేదండశర|
   త్కాండదపాండురమనోజ్ఞ-గాత్రద్యుతికిన్|| (2)

క. ఇందీవరసందోహక|
   ళిందసు తేందిందిరావ-ళీసుందరరు|
   గ్బందీకరణచణశ్రీ|
   తుందిలకంఠునకకుంఠ-దోగ్దండునకున్|| (3)

క. సురవర్ణితతుల్యాసా|
   గరసంగసమీపభూమి-కమనీయగుణా|
   భరణ గురుజానపల్లీ|
   పురవిహరణశీలునకువి-బుధపాలునకున్|| (4)

క. చరణానతశతమఖముఖ|
   సురపరివారునకు గోటి-సూర్యవిభాధి|
   క్కరణప్రవీణ తేజ:|
   పరిపూర్ణాకారునకు గృ-పాచారునకున్|| (5)