పుట:RameshwaraMahatyamu.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   సకలవిద్యావిశారదు-సత్కవిత్వ|
   పట్టభద్రునిశ్రీనాధు-బ్రస్తుతింతు|| (13)

క. భీమకవిరామభద్రుని|
   సోమునిభాస్కరకవీంద్రు-సూరనసుకవిన్|
   భూమీస్థలి నెన్ని కగల|
   శ్రీమంతులనాంధ్రకవివ-రేణ్యుల దలతున్|| (14)

మ. సరసప్రౌడవచో విలాసవిబుధా-చార్యున్సువష్ణాక్షమా|
    ధరధీరున్వివిధ ప్రబంధరచనా-దక్షున్శివధ్యానత|
    త్పరచిత్తుంబ్రణమత్సమస్తధరణీ-పాలంన్సుభద్రామనో|
    హరునింగొల్చెదమత్పితామహునిల-చ్చామాత్య చూడామణిన్|| (15)

గీ. మద్గురుస్వామినఖిలాగ-మస్వభూమి|
   సద్వినుతకీర్తిపాండిత్య-చక్రవర్తి|
   భక్తిభజియింతునాకర-పల్లికులసు|
   ధాపయోనిధిసోముకో-దండ రాము|| (16)

గీ. అతిమధురకోకిలధ్వను-లాలకించి|
   వాయసములోర్వ జాలక-వనరుభంగి|
   సుకవిసూక్తులకులికియ-నూయ జెంది|
   కుకవులరచినయంతన-కొదువ గాదు|| (17)

ఆ. కవులమనుచులేని-కానిపేరూరక|
   పూనితమ్ముదారు-పొగడుకొనుచు|
   సిగ్గువిడచితిరుగు-చెడుగులుసర్వజ్ఞ|
   నృపసభాస్థలమున-నిలువగలరె|| (18)

వ. అని యిష్టదేవతానమస్కారంబును బురాతనాధునాతన సుకవి పురస్కారంబునుం గుకవితిరస్కారంబునుం గావించి యొక్క మహాప్రబంధంబుసేయం దలంచియున్న సమయంబున|| (19)