పుట:RameshwaraMahatyamu.djvu/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. ఏవదాన్యునికుల-దైవంబుగురుజాన,
               పల్లిమల్లేశుండు-భవ్యమూర్తి|
   యేమంత్రితాతభూ-మీశసంపద్గుణ్య,
               మహిమోన్నతుడుచెన్న-మల్లమంత్రి|
   యేమహాత్మునితండ్రి-యిందుచందనకుంద,
               బృందనిర్మలకీర్తి భీమమంత్రి|
   యేధన్యుతల్లిధా-త్రీధరాధిపసుతా,
               కలితసౌభాగ్యవి-ఖ్యాతసీత|

గీ. యేమహాత్ముని సోదరుం-డీశ్వరాంఘ్రి|
   పూజనాసక్తిమతిసింగ-రాజు శౌరి|
   యతడుశ్రీభద్రిరాజువం-శాధికుండు|
   మహితగుణశాలిమల్లన-మంత్రిశౌరి|| (20)

వ. ఒక్కనాడువివిధ విద్వజ్జనపరివృతుండై నిజాస్థాన భవనంబునంగొలువుదీర్చి కూర్చుండి సప్తసంతాన ప్రముఖనిఖిల ధర్మరహస్యసమాకర్ణన సముదీర్ణసకుతూహలాయత్తచిత్తంబున. (21)

సీ. శోభితాపస్తంబ-సూత్రు వాధూలస,
             గోత్రు సమస్త స-ద్గుణసమేతు|
   నేనుగ లచ్చక-వీంద్రునిపౌత్రుని,
             శ్రీమాచి రాజునృ-సింహమంత్రి|
   దౌహితృభూవరా-స్థానపూజితు డుతి,
             మ్మనమంత్రికిని బేర-మకుద నూజు|
   థన్యుననంత ప్ర-ధానసోదరువీర,
             మంత్రికగ్రజురాజ-మాన్యచరితు|

గీ. నన్ను మతిమంతులక్ష్మణ-నామధేయు,
   నమర బిలిపించియుచితాస-నముననునిచి|