పుట:RameshwaraMahatyamu.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. ఆసమయంబున వేద|
   వ్యాసునిశిష్యుండుమౌని-వర్యుడునిత్యో|
   ల్లాసుడుసూతుడుకధికా|
   గ్రేసరు డచ్చటికివచ్చె-గీతిన్‌తభంగిన్|| (7)

చ. అనలునిభంగి దేజరిలు-నమ్మునినమ్మునినాధులాదరం|
   బున గనియర్ఘ్యపాద్యముల-బూజనముల్దగ జేసియున్నతా|
   సనమిడిచాలభక్తిని బ్ర-సన్నుని జేసిజగద్ధితార్ధమిం|
   పెనయగ వార లిట్లడిగి-రిమ్ములనొక్కమహారహస్యమున్|| (8)

క. సూతావింటివిసత్యవ|
   తీతనయునివలనసకల-దివ్యపురాణ|
   వ్రాతంబులుజగ దేక|
   ఖ్యాతగుణానీకు దెలియు-నఖిలార్ధములున్|| (9)

క. ఎయ్యవిపుణ్య క్షేత్రము|
   లెయ్యవితీర్థోత్తమంబు-లివ్వసుమతిలో|
   నెయ్యెడలభించుమోక్షము|
   చయ్యనజనులకుభవోగ్ర-జలనిధివలనన్|| (10)

గీ. ఎవ్విధమునను మేశర-మేశభక్తి|
   గలుగునరులకు నెద్దాని-నలనదొరకు|
   ద్రివిధకర్మఫలంబిది-తెలియ బలుకు|
   మాదరంబునమాకుమ-హామునీంద్ర|| (11)

క. మునివరులిట్లడిగిన వ్యా|
   సునకుంబ్రణమిల్లిపలికె-సూతుండుతపో|
   ధనులారమంచిప్రశ్నం|
   బొనర్చితిరిలోకహితము-యోజించిమదిన్|| (12)

ఆ. ఈరహస్యతత్వ-మిపుడేను లెస్స వ|
   చింతుమీకుమునుపు-చెప్పలేదు|