పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇటీవల పై సమస్యకి సంబంధించిన మరొక సమస్యని పరిష్కరించేరు. టేక్సీ సంఖ్యలలో అతి చిన్నది 1729 అయితే అతి పెద్దది ఏది? ఇప్పటివరకు మనకి తెలిసిన అతి పెద్ద టేక్సీ సంఖ్య 885623890831:

885623890831 = 75113 + 77303 లేదా 87593 + 59783

లెక్క వేసి చూసుకొండి. కంప్యూటర్లు ఉపయోగించి ఇంత కంటె పెద్దవి ఉన్నాయేమో వెతక వచ్చు.

1.2 రామానుజన్ చదరం

మనందరికీ సులభంగా అర్థం అయ్యే మరొక కానుక - రామానుజన్ నుండి. దీనిని రామానుజన్ చదరం అంటారు (బొమ్మ 1.3 చూడండి).

బొమ్మ 1.3 రామానుజన్ చదరం


ఈ బొమ్మలొ ప్రతి అరుస (row లేదా అడ్డు వరుస) లో సంఖ్యలని కూడి చూడండి. ప్రతి సారి మొత్తం 139 వస్తోంది కదా. ఇప్పుడు ప్రతి నిరుస (column లేదా నిలువు వరుస) లో ఉన్న సంఖ్యలని కూడి చూడండి. ఈ మొత్తాలూ 139 తో సమానమే!

ఇప్పుడు ఏటవాలుగా ఉన్న రెండు కర్ణాల వెంబడీ ఉన్న సంఖ్యలని కూడదాం.