పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంబంధించిన తప్పులని ఎత్తి చూపిన వారు కొందరైతే, గణితపరంగా, మౌలికమైన తప్పులని పట్టి, సవరించిపెట్టినవారు మరికొందరు. వీలయినంత వరకు తప్పులని సరిదిద్దేను. ఈమాట చరిత్రలో - నా అనుభవంలో - ఇటువంటి ప్రక్రియ జరగడం ఇదే మొదటిసారేమో. గణితంలోని మూల భావాలని ఇంగ్లీషు నుండి తెలుగులోనికి దింపినప్పుడు నా తెలుగులో ఇంకా వెలితి కనిపించవచ్చు. రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోమని పాఠకలోకానికి మనవి. ఒకటి, ఇది గణితంలో నిష్ణాతులైన పండితులని ఉద్దేసించి రాసినది కాదు; సామాన్య పాఠకులకి అర్థం అయే రీతిలో పదార్థాన్ని పరిచయం చెయ్యాలని చేసిన ప్రయత్నం. రెండు, తెలుగులో ఇటువంటి వ్యాసాలు రాయడానికి ఒరవడి అంటూ ఒకటి స్థిరపడలేదు. కనుక చదువుతూన్నప్పుడు మీకు కనిపించే లొసుగులు రాస్తున్నప్పుడు నాకు కనిపించవు. అందుకని పాఠకులందరూ ఇదే నిష్టతో నా వ్యాసాలని చదివి మీమీ అమూల్య అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి.

ఆధారాలు:

1. Maggie McKee, “First proof that infinitely many prime numbers come in pairs: Mathematician claims breakthrough towards solving centuries-old problem,” Nature: Breaking News, 14 May 2013

2. Zhang, Yitang. "Bounded gaps between primes," Annals of Mathematics (Princeton University and the Institute for Advanced Study). Retrieved August 16, 2013. http://annals.math.princeton.edu/2014/179-3/p07

3. Erica Klarreich, “Unheralded Mathematician Bridges the Prime Gap,” Quanta Magazine, May 19, 2013, https://www.quantamagazine.org/20130519-unheralded-mathematician-bridges-the-prime-gap/