పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంతర్జాతీయంగా జరిగిన వడపోతలో ఈ బహుమానాన్ని 2005 లో భార్గవ, సౌందరరాజన్ (మిషిగన్ విశ్వవిద్యాలయం) అనే ఇద్దరు భారతీయ నేపథ్యం ఉన్న శాస్త్రవేత్తలు అందుకోవటం గమనార్హం.

“ఈ రకం లెక్కల ప్రయోజనం ఏమిటి?” అని చాల మంది పెదవి విరుస్తారు. అందమె ఆనందం అన్నారు. దీన్నే ఇంగ్లీషులో A thing of beauty is a joy for ever అంటారు. కనుక ఈ రకం ఋజువుల కోసం వెతకటం ఒక రకమైన సౌందర్యోపాసన. “పనికిమాలిన ఈ రకం ఉపాసనలు ఎవ్వరికి కావాలి?” అని తోసి పుచ్చకండి. ఈ కంప్యూటర్ యుగంలో cryptography కి ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ రంగంలో రామానుజన్ వంటి వారు చేసిన పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి. ఇదే విధంగా విశ్వ రహశ్యాలని ఛేదించటానికి వాడే String Theory లో వచ్చే గణితంలో కూడా రామానుజన్ ప్రభావం కనబడటం మొదలైంది.

ఆధారాలు:

  1. Ivars Peterson, “All Square,” Science News, March 11, 2006
  2. Ken Ono, Honoring a gift from Kumbakonam,Notices of the AMS, 53:6, pp 640-651, June-July 2006.
  3. వేమూరి వేంకటేశ్వరరావు, “అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా,” ఈమాట, సెప్టెంబర్ 2006, http:eemaata.com/