పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిమిషాలు వస్తాయి, అవునా? (1 డిగ్రీ = 60 నిమిషాలు, 1 నిమిషం = 60 సెకండ్లు అనేది కోణ మానం.)

ఇప్పుడు మన శ్లోకం లోని మొదటి మాట ‘మఖీ’ విలువ ఎంతో లెక్క కడదాం.

మఖీ = 25 * (1000) + (2*100) = 225.

కనుక మఖీ అంటే 225, లేదా ఒక వృత్తం లోని తురీయంలో 24 వ వంతు. ఇలాగే శ్లోకం అంతా ఓపిక పట్టి చదువరులు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాగే వేదాలలో ఉన్న మంత్రాలు కూడ అర్థ గర్భితాలు. ఈ సూక్ష్మం కూడ పరిశోధన చేసి కనుక్కో వచ్చు.

ఆధారాలు:

  1. RoddaM Narasimha, “Science in Terse Verse,” Nature, 414:851, 2001
  2. వేమూరి వేంకటేశ్వరరావు, “అంకెలు-సంఖ్యలు: అర్ధగర్బితమైన శ్లోకాలు,” ఈమాట, జూలై 2001, http:eemaata.com/