పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ పద్ధతిలో లెక్క పెట్టటం ఎలాగో చూద్దాం. ముందుగా గుణింతాలని పరిశీలిద్దాం. (ఇక్కడ * గుర్తు గుణకారానికి చిహ్నం.)

క = క*అ = 1 * (1000) = 1

కి = క*ఇ = 1* (1001) = 100

గు = గ*ఉ = 3 * (1002) = 30,000

ఇప్పుడు ద్విత్వాక్షరాలని పరిశీలిద్దాం.

గ్న = గ + న = 3 + 20 = 23

గ్ను = (గ + న) * ఉ = 23 * (1002) = 230,000

ఖ్యు-ఘృ = ఖ్యు + ఘృ = (2 + 30) * (1002) + 4 * (1003) = 4, 320,000

ఇలా అంకెల స్థానంలో అక్షరాలు వాడి, ఆ అక్షరాలతో మాటలు పేర్చి, ఆ మాటలతో శ్లోకాలు కూర్చి, ఆ శ్లోకాలని కంఠస్థం చేసి, మన వాళ్ళు వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానాన్ని మనకి అందించేరు.

ఇంతా విశదీకరించి పైన చూపిన శ్లోకం యొక్క అర్ధం చెప్పక పోతే ఏమి బాగుంటుంది? ఒక వృత్తంలో నాల్గవ భాగాన్ని తురీయం అంటారు. ఇంగ్లీషులో ‘క్వాడ్రెంట్’ (quadrant). ఈ తురీయం లో ఉన్న 90 డిగ్రీలని 24 సమ భాగాలు చేస్తే ఒకొక్క భాగం 3.75 భాగలు (జ్యోతిష శాస్త్రంలో వచ్చే ‘భాగ’ అన్న మాట ఇంగ్లీషులోని ‘డిగ్రి’ కి సమానార్థకం). ఈ 3.75 భాగలని 60 పెట్టి గుణిస్తే 225