1
మాండ్ గర్భ రాగము
ఆది తాళము
కమలాంబ :-
శ్రీరమణ-మృదుచరణ-స్మరమణా-పరమపురుష-రామ॥ శ్రీ॥
పావనచరణ- పతితపావన-పాపభంజన- పురుషోత్తమ- హే॥
2
కాఫీ
ఆదితాళము
బ్రాహ్మణులు :-
దానవమర్దన, దశరథనందన, తామసభంజన, ధర్మగుణా |
తాపవిదారణ, తత్త్వవిచారణ, తాపసజనస్తుతి పారణా|| రా
జానకీ నాయక, సత్యవిధాయక, జ్ఞానప్రదీపక, శ్రీపదకా |
సజ్జనరక్షక, సౌఖ్యప్రదాయక - సామజపతి పరిపాల కా॥ రాః
3
శంకరాభరణము
రామదాసు :--
సీ॥ భద్రాద్రిరఘురాము భజనకు జనుచుండ
బంధుమిత్రులయాజ్ఞ బడయ నేల ?
జీవాత్మ భరియింప శ్రీవత్సధరు డుండఁ
దనువు పై మన కింత తమక మేల ?
హరి నామకీర్త నాహార పానము లుండ
నాకలిదప్పుల కడల నేల ?
సాయుజ్యమును జెంద సాధనతతు లుండ
సంసారవహ్నిలో సమయ నేల ?
గీ॥ భక్తిమీఱ గీర్ధింపు డీ భద్రవాస
జేతులార బూజింపు డీ శ్రీనివాసు
జిత్తమార సేవింపు డీ చిద్విలాసు
రాణ యొప్పార జేయుడీ రామభజన ॥
4
శంకరాభరణము
ఆదితాళము
అందరు :-
రామరామరము - రామపరాత్పర -రావణసంహార - రణధీరా | రథాంగధరఘన—పతంగ వాహన-రమారమణ నారాయణా | రామ॥ సారశీల సురలోలనిరంజన, సత్యపరాయణ సువిధానా | సరోజలోచన-సురేశ పాలన, శరణ్యముని బృందావనా॥ రామరామ॥
5
నాదనామక్రియ
మిశ్రచాపు
రెడ్లు:
స్వామి సేవ- సేయబోదము - నేడు సీతారాము సేవ సేయబోదము,
జానకమ్మ, లక్ష్మమన్న, చనువుతోడ రెండు దెసల
జానుగాను కొల్వ రామ-చంద్రు డెంత ముద్దు గాఱు,
ఐదుజోళ్ళతలలవాని…నట్టె నేల గూల్చె నన్న
ఆదిమూర్తి బ్రహ్మమన్న - యందమైనదేవు డన్న,
స్వామి సేవ- సేయబోదము
రాము సేవ- సేయబోదము
లక్ష్మన్న సేవ- సేయబోదము
సీతమ్మ సేవ- సేయబోదము।। స్వామి సేవ౹౹