Jump to content

పుట:Ramadasu 1933 East India Films-Song Booklet.djvu/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కథా సంగ్రహము


ఆంధ్రదేశమున ఆంధ్రజాతి యున్నంతవఱకును ఈ దివ్యమూర్తుల కీర్తి మూర్తి పరిపూర్ణ ప్రకాశముతో వెలుగునంతటి ప్రఖ్యాతిని వీరు “భద్రాద్రి " రామదాసు అని సంపాదించినారు. మన యీ రామదాసు చరిత్ర కథానాయకుని నిజమగు పేరు కంచెర్ల గోపన్న గారు. ఈ భక్తుని యొక్క… కథాభాగము చరిత్ర సనుసరించియున్నది. శ్రీరామసేవాతత్పరుడైన యీ రామదాసుచే నుద్ధరింపబడిన భద్రాచల శ్రీసీతారామ కల్యాణోత్సవములు నేటికిని లక్షొ పలక్షల దైవభక్తులను ప్రతీ వత్సరమును యోగ్యతానుసారముగా నాకర్షించుచున్నది. దేశ చరిత్ర ననుసరించి గోలకొండ నబాబు తానీషా యొక్క యౌదార్యముచే మన యీ రామదాసుగారు భద్రాచలము తహశీల్దారుగా నుద్యోగమున ప్రవేశించినారు.

ఈ కథ నేలకొండపల్లెలో గోపన్న గారు తన భార్యాపుత్రులతో గూడి దేవపూజ నొనర్చు సందర్బమున ప్రారంభింపబడును. కొందఱు భక్తులు హరిభజనతో భద్రాద్రి (శ్రీరామనవమి) కి వెళ్లు చుండుటను జూచి వారితో కలిసి తానును భద్రాద్రికి వెళ్లును.

ఏ పర్వతరాజంబగుభద్రగిరి శ్రీ సీతారామలక్ష్మణులకు నెల వయ్యెనో అచ్చట వేన వేలు దైవభక్తులు గుమిగూడి యుండుటను, గుడి ధర్మకర్తను చూచెదరు. దేవపూజ యొనర్పబడుచుండును.

కబీరు, మహమ్మదీయ ఫకీరు ; గొప్ప దైవభక్తుడు. శ్రీరామనవమి నాడు జరుగు నుత్సవములను జూచుటకు తాను సంకల్పించుకొన్న వాడై హరిభక్తులతోగూడి భద్రగిరి పైకి వెళ్ళుటకు పూనుకొనెను. ధర్మకర్త మొదలగువారు ఉత్సవమును జరుపుచుండెదరు, కబీరు తన మనస్సును శ్రీరాముని పై లీనమొనర్చి పాటపాడుకొనుచు పర్వత శిఖరమునొద్దకు వెళ్ళుచుండును. ధర్మకర్తకు కబీరు స్వరము వినబడిన వెంటనే చకితుడగును.మహమ్మదీయుడు హిందూదేవాలయమున ప్రవేశించుటను జూచి ధర్మకర్త మిక్కిలి కోపోద్దీపితమానసుడయ్యెను. 'మాదేవుని పేరు నీ వుచ్చరింపరా ' దనియు, 'దేవాలయమున బ్రవేశింపరా ' దనియు, కబీరును గద్దించును, కబీరు గొప్ప దైవభక్తుడు గాని ధర్మకర్త యొక్క బెదరింపులకు జంకక, తా `నేకాగ్ర చిత్తముతో రామునే భజించుచుండును. ధర్మకర్తయు, నతని యనుచరులందఱును గూడి కబీరును ఆవలికి గెంటింప బూనుకొందురు. దైవభక్తుని నిట్లు అవమానించుట కనులార చూడజాలక గోపన్న మిక్కిలి విచారపడును. కబీరు సామాన్యవేషధారక దైవ భక్తుడు కాడనియు, నిక్కంపు హరిభక్తు డనియు నెఱింగెను. గోపన్న ధర్మకర్తను శాంతింపుమని తెల్పి “నేను కబీరు వద్దనే యుండెదను. నీ వుత్సవ కార్యములను చూడబొ" మ్మని చెప్పెను. వెంటనే గోపన్న కబీరుయొక్క భగవత్ప్రసన్నత నెఱింగి మంత్రరాజమగు తారకమంత్రోపదేశము పొంది ప్రేమైకపాత్రుండగు శిష్యుం డయ్యను. కబీరు కొండ దిగి క్రిందికి ప్రయాణ మొనర్చిన వెంటనే ధర్మకర్త కొండపైకి వెళ్ళి శ్రీసీతారామలక్ష్మణుల విగ్రహంబులు గానక తత్తరపడి విచారించు చుండగా ఆవిగ్రహములు కబీరు హృదయమున లీనమగుట చూచెదరు. ధర్మకర్త నడవడిక వల్ల శ్రీరామునికి ఆగ్రహము కలిగి అదృశ్యుడయ్యెను. కావున మన మెల్లరము కూడి కబీరు పాదముల పైబడి క్షమింప వేడుకొని ఎటులైనను మనదేవులను మన కిచ్చునట్లు ప్రార్ధించి ధర్మకర్తను అతని పాదము పై బడవైచి క్షమించకోరుకొందము అని వారెల్లరు వెంటనే ధర్మకర్తను పిలుచుకొని వెళ్ళి కబీరును ప్రార్థించి తమ విగ్రహములు తమకు వచ్చునట్లు వేడుకొనగా కబీరు ననుగ్రహమున దేవతా విగ్రహములు