14 కీ॥ అట్టిపావనంబగుశాల యలఘుశీల మలపడినవారికే వలన గువిశాల లోల, పుణ్యలీల లొనర్చ నాలవాల a మై వెలయుచుండు చెఱసాల కదర నేల, రామదాసు : 21 నాద నామక్రియ ఆదితాళము ఏతీరున నను దయ చూచెదవో ఇనవంశోత్తను రామా నాతరమా-భవసాగర మీదను నళినదళేక్షణ రామ |॥ ఏ॥ శ్రీరఘునందన సీతారమణా - శ్రితజనపోషక రామ కారుణ్యాలయ-భక్త వరద-నను కన్నది కానుపు రామ ॥ఏ॥ క్రూరకర్మములు- నేరక జేసితి నేరము లెంచకు రామ దారిద్ర్యము పరిహారము సేయ వే-దైవశిఖామణి రామ ॥ ఏ॥ 22 యమ రామదాసు :-- ఆదితాళము రామరామజే- రాజారామ్ - రామరామజే - సీతారామ్ శబ్దబిందువై - చరాచరమై జీ తిర్మయ మై వాఙ్మయమై || రామరామ || ఆది అంతము లేని అకలంకుడవై - నాదబిందు వై సదానందమై ॥॥ రామ॥ ప్రార్థన :- 23 కల్యాణి పరబ్రహ్మ-పర మేశ్వర-పురుషోత్తమ సదానంద ॥పర॥ ద్రుపద్ 15 పరంజ్యోతి-పరాత్పర-పతితపావన- 'స్వప్రకాశ వరదాయక సకలలోక-వంచితసుఖదా ప్రమేయ పాహి పాహి-మాంపాహి ॥పరా॥ 24 కాంభోజి రాగము అట తాళము ఇక్ష్వాకుకులతిలక యిక పైన బలుకవె రామచంద్రా నన్ను రక్షింపు మిక యో రఘుకులతిలక శ్రీరామచంద్రా చుట్టుప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా ఈ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా॥ గోపురమంటపాల్కు, దురుగ గట్టిస్తి రామచంద్రా నన్ను క్రొత్తగ జూడక నిత్తఱి బ్రోవుము రామచంద్రా॥ భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్రా ఈ పతకమునకు బ బట్టె పదివేలవరహాలు రామచంద్రా || శత్రుఘ్నునకు నేను జేయిస్తి మొలత్రాడు రామచంద్రా ఆ మొలత్రాటికిబట్టె మొహరీలు పదివేలు రామచంద్రా॥ లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా ఈ పతకమునకు బ బట్టె పది వేలవరహాలు రామచంద్రా | సీతమ్మకు జేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ఈ పథకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా॥ వాహనములుమీకు వరుసతో జేయిస్తి రామచంద్రా జగన్మోహన సంకెళ్లు వేసిరి కాళ్ళకు రామచంద్రా | కలికతురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బ సొమ్మని రామచంద్రా॥॥ మీ తండ్రి దశరథమహారాజు పెట్టె నా రామచంద్రా లేక మీ మామ జనకమహారాజు 20 పెనా రామచంద్రా | 121 ఇ ၃။
పుట:Ramadasu 1933 East India Films-Song Booklet.djvu/10
స్వరూపం