పుట:Rajastana-Katawali.Part2.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

రాజస్థాన్ కధావళి


వడువున లోకభీకరుడై యుచితానుచితము నెఱుంగక చక్రవర్తిందెగ టార్ప వలయునని వానిపై ఖడ్గమువిసరెను. అద్భష్ట్రవశమున ఖడ్డము షాజ హానునకుం దగులక స్ఫటిక స్తంభములలో నొకడానికిం దగిలి విరిగి పోయెను. అప్పుడు సభాసదులు భయసంభ్రమాక్రాంతులైరి. చక్ర వర్తి మొక చిన్న గుమ్ముమున నంత పురమునకుం బారిపోయి యెట్లో ప్రాణములు దక్కించు కొనియె.

రాజపుతు)డు ఖడ్గపాణియై పిచ్చియెత్తిన మదపు టేనుంగు విధ మున సభామందిరమున విచ్చలవిడిగా దిరుగసుచు మితృడనక శతృడ నక కత్తికందిన వారినందఱ దెగటార్పజొచ్చె. ప్రళయముకాల రుద్రుని వలె నున్న వానియెదుట నెవ్వరు నిలువంజూలరైరి. ఎట్టకేలకు వాని మరంది వాని చేసిన పరాక్రమంబుల మెచ్చుకొనుచు మిత్రుడువోలె చల్లని మాటలు జెప్పుచు వానిదాంపునకుం బోయి యల్లన చేతిలోని కత్తి లాగి యొకపోటు బొడిచి వాని నేలం గూల్చెను. దారుణమయిన గాయము తగిలియు రాజపుత్రుడు కొనయూపిరి యున్నంతవఱకు సభా సదులకు దేరిచూడ శక్యము గాక యుండెను. ఆదినమున నుమ్రా చేత నైదుగురు మొగలాయి దొరలు నిహతులై పడిరి. అయిన నుమా) వృత్తాంతమంతతో ముగియలేదు. ఈరాజకుమారుడు పాదుషా కొలు వులో మృతినొందెనని వానిసైనికులు విని రోషవిహ్వల చిత్తులై క్రిందుమీదుగానక యెర్రబట్టలు కట్టుకొని యాయుధపాణులై దర్భారు ప్రవేశించి నేలంగూలియున్న తమ దొరంజూచి రెట్టించిన యలుకతో సింగంబులట్లు విజృంభించి యడవిలో వృక్షములు నరికినట్లు మొగ లాయిబంట్లను నరికి నేలయంతయు రక్తముతో జూరునట్లుః చేసిరి. ఆన భాభవనములోని స్తంభములు జూచువారికి నాడుజరిగిన చర్యలు నేటికైన జ్నప్తికి వచ్చుచుండును.

అట్లనేకులంబరిమార్చి యావీర సైనికులు పలుగాయములంజెంది తమస్వామిఋణము దీర్చికొని నేలనుగూలిరి. అనంతరము దర్భారున