పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శేఖరుఁడుగారు వస్తువులను బంచిపెట్టుచున్నా రన్నమాటను విన్న తోడనే యిరుగుపొరుగుల బ్రాహ్మణోత్తములు వాయువేగమునఁ బరు గెత్తుకొనివచ్చిరి. బండిలో స్థలముచాలక క్రింద నుంచిన తట్టలు మొదలగువానిని మాణిక్యాంబయుఁ దన్ననుసరించుచున్నవారికిఁ బంచిపెట్టెను. తరువాతఁ బెట్టెలును నిత్తడి సామానులను బండిలో నెక్కింపఁబడినవి; మునుపు నాలుగుబండ్లలో నెక్కించినను సరి పోని సామాను లిప్పు డొక్క బండిలోనికే చాలక దానిలో నలుగురు గూరుచుండుటకు స్థలముకూడ మిగిలెను. రాజశేఖరుడుగా రెంత తొందరపెట్టుచున్నను మాణిక్యాంబ తన కాప్తు రాండ్రయిన యొక రిద్దఱు పొరుగు స్త్రీల వద్ద సెలవు పుచ్చుకొని వచ్చుటకే ప్రత్యేకముగా నాలుగు గడియ లాలస్యము చేసెను. ఈలోపుగా మంచములను బండిగూటిపయిని గట్టించి, పిల్లలను బండిలో నెక్కించి, రాజ శేఖరుఁడుగారు కోపపడినందున మాణిక్యాంబవచ్చి బండిలోఁ గూర్చు చుండెను. బండివాని వద్దకు వచ్చినప్పటినుండియు గొంచెము వట్టిగడ్డిపరకలతోను కావలసినంత జలముతోను మితాహారమును గొనుచు పథ్యముచేయుచున్న బక్క యెడ్లు మెల్లఁగా బండిని లాగ నారంభించెను. బండివాఁడును వానివెనుకనే నడచుచు మేత వేయు టలో బరమలుబ్దుడుగానే యున్నను కొట్టుటలో మాత్రము మిక్కిలి యౌదార్యమును గనఁబఱుపసాగెను. ఊరిబయలవఱకును వచ్చి, రాజశేఖరుఁడు గారివలన బిచ్చములనుగొన్న నిరుపేదలయిన తక్కువ జాతులవారు పలువిధముల వారిని దీవించి, విచారముతో వెనుకకు మరలిపోయిరి. నల్లమందు వేసికొనుటచేతనో త్రాగుటచేతనో సహజ మైన మత్తతచేతనో యీ మూడునుగూడఁ గలియుటచేతనో త్రోవ పొడుగునను తూలుచుఁ గునుకుపాట్లు పడుచు నడుచుచున్న బండి వాఁడు మొత్తనెక్కి కూరుచుండి బండిలోని వారికి పరిమళమును ఆకాశమునఁ జిన్నమేఘములను గలుగునట్టుగా సగము కాలియున్న ప్రాఁతపొగచుట్టలను నాలిగింటిని గుప్పుగుప్పున గాల్చి బండిలోని పెట్టెకుఁ జేరగిలబడి హాయిగా నిద్రపోయెను. బండియు