పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విరచిత 'ది వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డు’ నవలకు స్వేచ్ఛానుసరణ మని పంతులుగారే చెప్పారు. కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగా రనేవారు వివేకచంద్రికా విమర్శన మన్న గ్రంథాన్ని పంతులు గారినీ, రాజశేఖర చరిత్రనూ విమర్శిస్తూ ప్రకటించారు, కాని యీ విమర్శ ఆంతా కూడా పంతులుగారిపై వారికి గల స్పర్థనే ప్రకటించింది కాని, ప్రతిభను చూపలేక పోయింది.


వీరేశలింగం పంతులుగారి రాజశేఖర చరిత్రం వెలువడక పూర్వమే నరహరి గోపాలకృష్ణమ్మసెట్టిగారు తమ 'హిందువుల యాచారములను తెలుపు:నవీన ప్రబంధమైన' శ్రీ రంగ రాజ చరిత్రను వెలువరచారు, ఇది 1872లో ఫుస్తక రూపాన వచ్చింది. ప్రచురణకు నోచుకోకపోయినా, గోపాలకృష్ణమ్మసెట్టిగారికన్నా కూడా పూర్వమే కొక్కొండ వేంకటరత్నం పంతులు గారు “మహాశ్వేత” ఆన్న వచన ప్రబంధాన్ని రచించి వున్నారన్న వాదన కూడా వున్నది. ఈ రెండు విషయాలూ నిజమే ఆయినప్పటికీ కూడా, రాజశేఖర చరిత్రం యొక్కప్రాముఖ్యానికీ, ప్రశస్తికీ, ప్రాథమ్యానికీ ఏమీ భంగం రాదు, ఎందువల్ల నంటే ఎవరు ఆర్వాచీనులకు ఆరాధ్యులు, ఆనుసరణీయులు, మార్గదర్శకులూ అవుతారో, వాళ్ళే ఆద్యులూ, ఉపదేష్టలూ ఆన్న కీర్తిని పొందుతారు, తరువాత వ్రాసిన నవల లన్నిటికీ, నవలా రచయిత లందరకూ చాలా కాలం వరకూ, రాజశేఖర చరిత్రమే మార్గదర్శకంగా వున్నది,

కనుకనే రాజశేఖర చరిత్రం తొలి తెలుగు నవల ఆయింది. వీరేశలింగం పంతులుగారు తెలుగు నవలకు శ్రీకారం చుట్టిన వారూ అయినారు.

సుప్రసిద్ద నవలా రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తమ స్వీయ చరిత్రలో తాము నవలలు వ్రాయటం రాజశేఖర చరిత్రం చదివి, గ్రహించి, నేర్చుకున్నామని వ్రాసుకున్నారు. చిలకమర్తి ఆ రోజుల్లో బహుళ ప్రచారం పొందిన నవలల నెన్నో వ్రాశారు, ఆ రోజుల్లో చింతామణి ఆన్న సాహిత్య మాసపత్రిక నవలల పోటీలను నిర్వహిస్తుం